Errabelli Comments: భాజపాకు ధైర్యముంటే హైదరాబాద్‌లో చర్చకు రావాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సవాల్ విసిరారు. రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన పనుల్లో పదో వంతు చూపించాలని డిమాండ్ చేశారు. వడ్లు కొనబోమని చెప్పినా.. రైతులను భాజపా నేతలు రెచ్చగొట్టి వేసేలా చేశారని మండిపడ్డారు. 24 గంటల కరెంట్ ఇచ్చి.. సాగునీళ్లు, పెట్టుబడి సాయం చేస్తున్నా... వరి వేయొద్దని రైతులను కోరామని తెలిపారు. అప్పుడేమో తామే కొంటామని చెప్పి.. ఇప్పుడేమో కేసీఆర్ కొనాలని లేఖలు రాస్తున్నారన్నారు.
బాధతోనే కేసీఆర్ కోరారు..
"ఎక్కడో ఉండి మాట్లాడటం కాదు. దమ్ముంటే హైదరాబాద్‌లో చర్చకు రండి. రైతులకు కేంద్రం ఏం చేసింది.. మేము ఏం చేశామో తెలుస్తుంది. మేము చేసిన పనుల్లో మీ పనులు పదో వంతు చూపించండి చాలు.. నేను ఒప్పుకుంటా. కేంద్రం మమ్మల్ని చూసి రైతులకు అరకొర సాయం చేసింది. ముడి బియ్యం కేవలం వానాకాలంలో పండుతుంది. యాసంగిలో వచ్చే బియ్యంలో అంతా నూకలుంటాయి. వడ్లు కొనబోమని మేము చేప్పినా.. రైతులను భాజపా నేతలు రెచ్చగొట్టారు. కేసీఆర్ కొన్నా.. కొనకున్నా మేమే కొంటామని గతంలో ఇదే భాజపా నేతలన్నారు. ఇప్పుడేమో మళ్లీ.. కేసీఆర్ వడ్లు కొనాలని నిన్న బండి సంజయ్ లేఖ రాశారు. బాధపడుతూనే వరి వేయద్దని రైతులకు సీఎం కేసీఆర్ చెప్పారు. సాగునీళ్లు, విద్యుత్, పెట్టుబడి సాయమిస్తున్న కూడా సాగు వద్దని రైతులను కోరాం." - ఎర్రబెల్లి దయాకర్రావు, మంత్రి
ఇదీ చూడండి: