Milan 2022: ఏపీ విశాఖ మరో భారీ నౌకా ఉత్సవానికి సిద్ధమవుతోంది. ఈనెల 25 నుంచి మార్చి 4 వరకు విశాఖ వేదికగా మిలాన్ ఉత్సవం నిర్వహించనున్నారు. మూడేళ్ల క్రితమే ఈ మినీ ఐఎఫ్ఆర్ జరగాల్సి ఉన్నా... కొవిడ్ దృష్ట్యా వాయిదాపడుతూ వస్తోంది. 1995లో నాలుగు దేశాలతో ప్రారంభమైన మిలాన్ కార్యక్రమంలో ఈ ఏడాది 45కి పైగా దేశాల యుద్ధ నౌకలు పాల్గొననున్నాయి. వివిధ దేశాల నౌకలకు ఆతిథ్యమిచ్చేందుకు పరేడ్, ఇతర విన్యాసాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. దాదాపు 50కి పైగా యుద్ద నౌకలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి.
మిలాన్ ఉత్సవం నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. బీచ్‌రోడ్‌ను సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం సహాయ సహకారాలు అందిస్తోంది. ఈనెల 26న ఉత్సవం ఆరంభ వేడుక నిర్వహించనున్నారు. 27న అంతర్జాతీయ సిటీ పరేడ్ ఉంటుంది.
25 నుంచి 28 వరకు హార్బర్ దశ, మార్చి 1 నుంచి 4 వరకు సముద్రపు దశగా వేడుకలు నిర్వహించనున్నారు. మార్చి 4న మిలాన్ 2022 ముగింపు ఉత్సవం నిర్వహించనున్నారు.
ఇదీ చదవండి: