ETV Bharat / city

3 రోజులు ముందుకు.. ఒక్క పూటలో మళ్లీ వెనక్కు!

లాక్​డౌన్​తో ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వలస కూలీలు నడకే శరణ్యంగా భావిస్తున్నారు. ఏపీలోని గుంటూరు జిల్లాకు వచ్చిన వలస కూలీలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాడికొండ మండలం రావెలలో ఉండి పోయారు. స్వగ్రామం నంద్యాలకు వెళ్లేందుకు మూడు రోజులుగా నడుస్తున్నారు. గుంటూరు జిల్లా సరిహద్దు లక్ష్మీపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే అక్కడ ఉన్న ఎస్ఐ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యానులో వెనక్కు పంపారు.

guntur news
3 రోజులు ముందుకు.. ఒక్క పూటలో మళ్లీ వెనక్కు!
author img

By

Published : Apr 30, 2020, 2:42 PM IST

కరోనా నేపథ్యంలో స్వగ్రామాలకు చేరుకునేందుకు 3 రోజులుగా నడిచి వస్తున్న వలస కూలీలను పోలీసులు అడ్డుకున్నారు. వారిని వెంటనే మినీ వాహనంలో తిరిగి వారు బయలు దేరిన చోటుకు తరలించారు. కూలీ పనుల కోసం ఏపీలోని గుంటూరు జిల్లాకు వచ్చిన వలసకూలీలు లాక్‌డౌన్‌ నేపథ్యంలో తాడికొండ మండలం రావెలలో చిక్కుకుపోయారు.

వీరంతా నంద్యాలకు వెళ్లడానికి వంట సామగ్రి సహా మూడురోజుల క్రితం బయల్దేరారు. తిప్పలు పడి బుధవారం గుంటూరు జిల్లా సరిహద్దు లక్ష్మీపురం చెక్‌పోస్టు వద్దకు చేరుకోగానే అక్కడ విధులు నిర్వహిస్తున్న మహిళా ఎస్సై వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే తిరిగి వెళ్లాలని ఆదేశించారు.

మూడు రోజుల నుంచి నడిచి వస్తున్నాం.. మా ఊరుకు పంపండి అని వేడుకున్నారు. ఊరిలో ఉన్న పిల్లలు ఏడుస్తున్నారు.. తిండిలేక అల్లాడుతున్నారని వాపోయినా వినిపించుకోలేదు. అక్కడే ఉన్న ఓ వాహనంలో తక్షణమే వెనక్కు పంపారు. చివరకు వలస కూలీల నుంచే వాహనానికి డబ్బులు ఇప్పించి ఓ కానిస్టేబుల్‌ను, స్థానిక వైకాపా కార్యకర్తను ఇచ్చి రావెల గ్రామానికి పంపారు.

ఇవీచూడండి: ఇంటిపట్టున ఉండు.. విజ్ఞానం చేతపట్టు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.