ETV Bharat / city

Mess Charges Hike for TS Students : మెస్‌ఛార్జీల పెంపు కొలిక్కి వచ్చేదెన్నడు..? - తెలంగాణలో మెస్ ఛార్జీల పెంపు సమస్య

Mess Charges Hike for TS Students : రాష్ట్రంలో సంక్షేమ, వసతి గృహాలు, గురుకులాల్లో విద్యార్థులకు అందిస్తున్న మెస్‌ఛార్జీలు ఎటూ చాలడం లేదు. పెరిగిన ధరలతో నాణ్యమైన భోజనం అందించడం కష్టమవుతోంది. మెస్ ఛార్జీల పెంపు నిర్ణయం ఆలస్యమవుతోంది. ఈ అంశంపై కనీసం అసెంబ్లీ సమావేశాల్లోనైనా ఓ నిర్ణయం తీసుకోవాలని సంక్షేమ శాఖలు భావిస్తున్నాయి.

Mess Charges Hike for TS Students
Mess Charges Hike for TS Students
author img

By

Published : Sep 10, 2022, 10:37 AM IST

Mess Charges Hike for TS Students : రాష్ట్రంలోని సంక్షేమ వసతిగృహాల్లో, గురుకులాల్లో విద్యార్థులకు మెస్‌ఛార్జీల పెంపు నిర్ణయం ఆలస్యమవుతోంది. ఉమ్మడిగా ప్రతిపాదనలు ఖరారు చేయాలని సంక్షేమ శాఖలు నిర్ణయించినా, సంబంధిత మంత్రులు అందుబాటులో లేక కొన్నాళ్లుగా వాయిదా పడుతూ వస్తోంది. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో సంక్షేమ మంత్రులతో ఉమ్మడి సమావేశం నిర్వహించి మెస్‌ ఛార్జీల ప్రతిపాదనలు కొలిక్కి తేవాలని సంక్షేమశాఖలు భావిస్తున్నాయి. పెరుగుతున్న ధరల నేపథ్యంలో పెంపు కనీసం 30 శాతం వరకు ఉండాలని భావిస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ధరలతో గురుకులాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం కష్టమవుతోంది.

ఆహారపట్టికలో తప్పని మార్పులు.. సంక్షేమశాఖల్లో విద్యార్థులకు అందిస్తున్న మెస్‌ఛార్జీలు ఎటూ చాలడం లేదు. పెరిగిన ధరలతో ఆహారపట్టిక మేరకు నాణ్యమైన భోజనం అందించటం కష్టమవుతోంది. ఫలితంగా గురుకులాల ఆహారపట్టికలో మార్పులు చేసుకున్నారు. కొన్నిచోట్ల నెలలో నాలుగుసార్లు ఇవ్వాల్సిన మాంసాహారాన్ని రెండు రోజులకు తగ్గించారు. ఈ క్రమంలో నాణ్యమైన ఆహారాన్ని అందించాలంటే తప్పనిసరిగా మెస్‌ఛార్జీలు పెంచాలని, అందుకు అనువుగా ఐదేళ్ల క్రితం ఖరారు చేసిన ఛార్జీలు సవరించాలని సంక్షేమశాఖలు నిర్ణయించాయి. కనిష్ఠంగా 30-35 శాతం నుంచి గరిష్ఠంగా 50 శాతం పెంపు ఉండేలా అంచనాలు రూపొందించాయి.

Mess Charges Hike for Telangana Students :అయితే 30-35 శాతానికి మించితే ఆర్థికశాఖ నుంచి కొర్రీలు వచ్చే అవకాశముందని భావిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2017-18లో మెస్‌ఛార్జీలను తరగతుల వారీగా రూ.950 నుంచి రూ.1,500కు పెంచింది. తరగతుల వారీగా ఒక్కో విద్యార్థికి రోజుకి రూ.31.66 నుంచి రూ.50గా నిర్ణయించింది. చిన్నపిల్లలకు మెస్‌ఛార్జీలు రూ.950గా నిర్ణయించి రోజుకి రూ.31.66 చొప్పున ఖర్చుచేస్తోంది. ఈ ఛార్జీలను రూ.40గా పెంచాలని తాజా ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. అంటే ఆ విద్యార్థులకు నెలకు రూ.1200 వచ్చే అవకాశం ఉంది. అలాగే 8-10 తరగతుల విద్యార్థులకు రూ.1100 నుంచి రూ.1500, పోస్టుమెట్రిక్‌ విద్యార్థులకు రూ.1500 నుంచి రూ.2000గా చేయాలని భావిస్తున్నాయి.

ఉపకారవేతనాలపై.. గురుకులాలు, వసతిగృహాల్లో విద్యార్థులకు మెస్‌ఛార్జీలు పెంచితే.. అదే స్థాయిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ డే స్కాలర్‌ విద్యార్థులకు ఉపకారవేతనాలు పెంచాల్సి ఉంటుంది. ప్రస్తుతం డేస్కాలర్‌ విద్యార్థులకు కోర్సుల కేటగిరీల వారీగా నెలకు రూ.500, రూ.650 చొప్పున ఉపకారవేతనాలుగా ప్రభుత్వం చెల్లిస్తోంది. మెస్‌ఛార్జీల తరహాలో 30 శాతం చొప్పున పెంచితే నెలకు రూ.650, రూ.850గా చేసే అవకాశాలున్నాయని సంక్షేమవర్గాలు వెల్లడించాయి. తద్వారా ఉపకారవేతనాలపై భారం ఏడాదికి మరో రూ.200-250కోట్ల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నాయి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.