Chiranjeevi blessing for fan daughter marriage: అభిమాని కుమార్తె వివాహానికి మెగాస్టార్ చిరంజీవి ఆశీర్వాదం పంపారు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రాజాం పరిధిలోని కొండంపేటకు చెందిన కొండల్‌రావు చిరంజీవికి వీరాభిమాని. 30 ఏళ్లుగా టీ దుకాణం నిర్వహిస్తూ చిరంజీవి యువత ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అతని కుమార్తె నీలవేణి పెళ్లికార్డుపై.. చిరంజీవి దంపతులు, నాగేంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చిత్రాలు ముద్రించి అభిమానాన్ని చాటుకున్నాడు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపకులు స్వామినాయుడు ద్వారా ఈ విషయం చిరంజీవి వరకు వెళ్లింది.
ఈనెల 10వ తేదీన జరగనున్న వివాహానికి కానుకగా కొండలరావు ఖాతాలో చిరంజీవి రూ.లక్ష జమ చేశారు. ట్విటర్ ద్వారా పెళ్లి కుమార్తెకు ఆశీస్సులు తెలియజేశారు. చిరంజీవి యువత సంఘ సభ్యులు మరో లక్ష రూపాయలు అందజేశారు. దీనిపై కొండలరావు ఆనందం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి ఎప్పటికప్పుడు అభిమానులకు అండగా నిలవడం పట్ల రాజాం టౌన్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు జగదీశ్ తదితరులు హర్షం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: