ETV Bharat / city

generic medicine : మందుల ఖర్చు తడిసి మోపెడు.. జనరిక్‌తోనే విరుగుడు

author img

By

Published : Dec 21, 2021, 5:36 AM IST

generic medicine: రోజురోజుకు మెడిసిన్​ ధరలు పెరిగిపోతున్నాయి. జీవనశైలి వ్యాధులు సహా ఇతర వ్యాధులకు ఔషధాలు వినియోగించాల్సి రావడంతో వేలకు వేలు ఖర్చులవుతున్నాయి. ఇది సామాన్యుడికి మోయలేని భారమవుతోంది. అదే జనరిక్​ మందులు అందుబాటులోకి వస్తే ప్రజలకు కాస్త ఉపసమనం కలగనుంది. వీటి వాడకంపై ప్రజల్లో మరింత అవగాహన కలిగించాల్సి ఉంది.

generic medicine, జనరిక్‌ మందులు
generic medicine

generic medicine: మహేశ్‌ది మధ్యతరగతి కుటుంబం. ఎంతో ఒత్తిడితో కూడుకున్న జీవన విధానం కావడంతో అధిక రక్తపోటు, మధుమేహం బారినపడ్డాడు. వాటికి క్రమం తప్పకుండా వైద్యుల సలహా మేరకు మందులు వాడుతున్నాడు. ప్రతి నెలా రూ.2,500 నుంచి రూ.3,000 వరకూ ఖర్చవుతోంది. ఏడాదిన్నర క్రితం ఇంత ఖర్చు ఉండేది కాదు. కానీ, కొవిడ్‌ దెబ్బకు ఔషధాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

ఇది ఒక్క మహేశ్‌కు మాత్రమే ఎదురైన సమస్య కాదు.. ఉరుకులు, పరుగులతో కూడుకున్న ప్రస్తుత జీవన విధానంలో ఎంతో మంది జీవనశైలి వ్యాధుల బారిన పడుతున్నారు. వీటికి నిత్యం మందులు వాడాల్సి వస్తుంటుంది. ఒకవైపు ఔషధ ధరలు ఆకాశాన్నంటుతుండగా.. మరోవైపు సరసమైన ధరల్లో అందించాలనే లక్ష్యం నీరుగారిపోతోంది. జనరిక్‌ మందుల అందుబాటు.. వాటి వినియోగంవైపు ప్రజలను ప్రోత్సహించే చర్యలు మృగ్యమవుతున్నాయి. దీనిపై తక్షణం దృష్టిపెట్టాల్సిన ఆవశ్యకతను ప్రస్తుత పరిస్థితులు నొక్కి చెబుతున్నాయి.

హైబీపీని అదుపు చేయటానికి ఎక్కువగా వినియోగిస్తున్న టెల్మిసార్టన్‌, రామిప్రిల్‌.. తదితర ఔషధాలు బ్రాండెడ్‌ కంటే సగం ధరకే ‘జనరిక్‌’లో లభ్యమవుతున్నాయి. అలెర్జీ, దగ్గు.. తదితర లక్షణాలకు వాడే మాంటెలూకాస్ట్‌, లెవోసిట్రెజిన్‌ సమ్మిళిత ఔషధాలు నాలుగో వంతు ధరకే దొరుకుతున్నాయి. మొత్తంగా బ్రాండెడ్‌తో పోల్చితే జనరిక్‌ మందుల ధరలు 30-90 శాతం తక్కువ. పనితీరులో ఎలాంటి వ్యత్యాసం ఉండదు.

మూడొంతుల ఖర్చు మందులకే

ఇటీవల విడుదలైన ‘నేషనల్‌ హెల్త్‌ అకౌంట్స్‌’ సమాచారం ప్రకారం.. రోగులు చికిత్స కోసం పెట్టే మొత్తం ఖర్చులో 36.8 శాతం మందుల వాటా ఉంటున్నట్లు వెల్లడైంది. అంటే మొత్తం వైద్య ఖర్చుల్లో మూడో వంతు మందుల వ్యయమే ఉంటున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఉదాహరణకు మధుమేహ చికిత్సలో వినియోగించే ‘గ్లిమిపిరైడ్‌+ మెట్‌ఫార్మిన్‌ 2ఎంజీ/1000ఎంజీ’ ఔషధ ధర బ్రాండెడ్‌లో 10 మాత్రలకు రూ.60-100 వసూలు చేస్తున్నారు. రోజుకు రెండు చొప్పున నెలకు 60 మాత్రలు వాడాల్సి ఉంటుంది. అప్పుడు వీటి ధరే రూ.360-600 వరకూ అవుతోంది. ఇలా ఏ ఔషధాన్ని తీసుకున్నా ధరలు మండిపోతున్నాయి.

ఫలితమివ్వని చర్యలు

ప్రజలకు మందుల ధరల భారం తగ్గించే లక్ష్యంతో దాదాపు పదేళ్ల క్రితమే జనరిక్‌ ఔషధాలకు ప్రాచుర్యం కల్పించాలని కేంద్రం ప్రయత్నాలు చేపట్టింది. జన ఔషధి దుకాణాలు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయటం, దేశీయ ఫార్మా కంపెనీలను జనరిక్‌ ఔషధాలు ఉత్పత్తి చేసే దిశగా పోత్సహించటం వంటి నిర్ణయాలను అమలు చేసింది. కానీ ఇవి ఆశించినరీతిలో ముందుకు సాగలేదు.

జనరిక్‌ మందులంటే..

ఏదైనా సంస్థ స్వతహాగా పరిశోధన చేసి మందును కనుగొంటే.. ప్రభుత్వం మేధో హక్కు(పేటెంట్‌ రైట్‌) ఇస్తుంది. దాని కాలపరిమితి పూర్తయ్యాక మందు తయారీ ఫార్ములా జాతీయం అవుతుంది. దాన్ని వినియోగించి తయారయ్యేవే జనరిక్‌ మందులు. పరిశోధన సంబంధిత వ్యయప్రయాసలు లేనందున అవి తక్కువ ధరకు లభిస్తాయి.

నాణ్యతపై అపోహలొద్దు

కొన్ని అత్యవసర చికిత్సలకు వినియోగించే మందులు మినహాయించి.. అత్యధిక రకాల ఔషధాలు జనరిక్‌ షాపుల్లో లభిస్తున్నాయి. అన్ని రకాల మందులను జనరిక్‌లోనూ అందుబాటులోకి తీసుకురావాలి. ‘నేషనల్‌ అక్రిడిటేషన్‌ బోర్డు ఫర్‌ టెస్టింగ్‌ అండ్‌ కాలిబ్రేషన్‌ ల్యాబొరేటరీస్‌(ఎన్‌ఏబీఎల్‌)’ గుర్తింపు పొందిన ప్రయోగశాలల్లో పరీక్షించిన తర్వాతే వీటిని విడుదల చేస్తున్నారు. జనరిక్‌ మందుల నాణ్యతపై అపోహలొద్దు.

-టి.శ్రీనివాస్‌, జనరిక్‌ ఔషధ దుకాణదారు, గాంధీ ఆసుపత్రి

జనరిక్‌ను విస్తృతపరచాలి

మార్కెట్లో జనరిక్‌, బ్రాండెడ్‌, బ్రాండెడ్‌ జనరిక్‌ అని మూడు రకాలుగా అందుబాటులో ఉంటున్నాయి. ఒకే ఉత్పత్తి సంస్థ ఔషధాలను రెండు రకాలుగా విక్రయించాలనుకుంటున్నప్పుడు.. రోగికి వాటి నాణ్యతపై అనుమానాలొస్తున్నాయి. ఇలా కాకుండా ఔషధాల ఉత్పత్తి సమయంలోనే జనరిక్‌ అని ముద్రించి ఇస్తే బాగుంటుంది. కంపెనీ పేరు, జనరిక్‌ పేరు మాత్రమే ఉండాలి. బ్రాండెడ్‌ జనరిక్‌ అనే పేరు మీద ఉత్పత్తి కాకూడదు. అప్పుడు రోగికి కూడా ఔషధాన్ని ఎంచుకునే వీలుంటుంది. సాధారణ ఔషధ దుకాణాల్లోనూ జనరిక్‌ మందులను విస్తృతంగా అమ్మడానికి అవకాశాలుంటాయి.

-అరుగొండ శ్రీధర్‌, జీహెచ్‌ఎంసీ ఔషధ దుకాణదారుల సంఘం అధ్యక్షుడు

ఇదీచూడండి: 'ఒమిక్రాన్ తీవ్రత.. డెల్టా కంటే తక్కువే అని చెప్పలేం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.