ETV Bharat / city

Heart disease : రక్తప్రసరణ లోపాల మృతులు తెలంగాణలో 56 శాతం!!

జీవనశైలిలో మార్పులు మనుషుల ఆయువు తగ్గించేస్తున్నాయి. ఈ మార్పుల వల్ల నమోదవుతున్న మరణాల్లో హృదయ(Heart disease) సంబంధమైనవే అత్యధికంగా ఉన్నాయని ఎంసీసీడీ తాజా నివేదికలో వెల్లడైంది. రక్తప్రసరణ లోపాల మృతులు తెలంగాణలో 56 శాతం, ఏపీలో 32 శాతం ఉన్నట్లు తెలిపింది.

రక్తప్రసరణ లోపాల మృతులు తెలంగాణలో 56 శాతం

author img

By

Published : Sep 6, 2021, 7:07 AM IST

మారుతున్న జీవనశైలి గుండె(Heart disease) జబ్బులకు, మరణాలకు కారణమవుతోంది. మొత్తం వైద్య ధ్రువీకరణ మరణాలకు కారణాలను విశ్లేషిస్తే.. శరీరంలోని రక్తప్రసరణ వ్యవస్థ సమస్యలవల్ల సంభవించే మరణాలే అత్యధికమని స్పష్టమైంది. ఈ కారణంగా దేశంలో 32.7 శాతం మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. అత్యధికంగా లక్షద్వీప్‌ 63.7 శాతంతో ముందుండగా.. డామన్‌, డయ్యూ 59.9 శాతంతో రెండోస్థానంలో, తెలంగాణ 56 శాతంతో మూడోస్థానంలో నిలిచింది. ఆంధ్రప్రదేశ్‌లో 32.4 శాతం మరణాలు నమోదయ్యాయి. వైద్యపరంగా ధ్రువీకరించిన మరణ కారణాల(ఎంసీసీడీ)పై భారత ప్రభుత్వ జనగణన విభాగం తాజాగా విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది.

సమాచార నమోదులో వెనకబాటు

ఎంసీసీడీ-2019 ప్రకారం.. దేశం మొత్తమ్మీద 2019లో 15,71,540 వైద్యపరంగా ధ్రువీకరించిన మరణాలు చోటుచేసుకోగా.. ఇందులో పురుషులు 9,77,199 మంది.., మహిళలు 5,94,341గా నమోదయ్యారు. ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్‌లో మొత్తంగా 4,01,472 మరణాలు సంభవించగా.. ఇందులో ఎంసీసీడీలో పొందుపరిచినవి 51,659(12.9 శాతం) మాత్రమే. ఇదే సంవత్సరం తెలంగాణలో 2,28,294 మొత్తం మరణాలు చోటుచేసుకోగా.. ఎంసీసీడీలో సమాచారాన్ని అందించినవి 63,236(27.7 శాతం) మాత్రమే. సమాచార నమోదు ర్యాంకులపరంగా చూస్తే ఏపీ 27వ స్థానంలో, తెలంగాణ 18వ స్థానంలో ఉన్నాయి. ఏపీలో 2,483 ఆసుపత్రుల్లో ఎంసీసీడీకి అనుమతులుండగా.. 965 ఆసుపత్రులు మాత్రమే సమాచారాన్ని పొందుపరుస్తున్నాయి. తెలంగాణలో 7,144 ఆసుపత్రులకు గాను 284 మాత్రమే మరణాల వివరాలను పొందుపరచడం గమనార్హం.

.

వయసుల వారీగా..

  • ఏడాది వయసులోపే 7.6 శాతం మంది చిన్నారులు మరణిస్తున్నారు.
  • పుట్టగానే తీవ్ర అనారోగ్య సమస్యలతో 71.6 శాతం శిశువులు కన్నుమూస్తున్నారు.
  • 1-4 ఏళ్ల మధ్యవయస్సు చిన్నారుల్లో 22.9 శాతం మంది ఇన్‌ఫెక్షన్లతో మరణిస్తుండగా.. ఇవే కారణాలతో 5-14 ఏళ్ల మధ్యవయస్కుల్లో 24.1 శాతం మంది చనిపోతున్నారు.
  • గాయాలు, విషం తీసుకోవడం, ఉరి వేసుకోవడం, ఇతర కారణాలతో చనిపోయినవారు 15-24 ఏళ్ల మధ్య వయస్కుల్లో 18.8 శాతం మంది ఉన్నారు.
  • 25-34 ఏళ్ల వయస్సులో రక్తప్రసరణ వ్యాధులతో 21.3 శాతం మంది, ఇన్‌ఫెక్షన్లతో 15.8 శాతం మంది, 35-44 ఏళ్ల వారిలోనూ రక్తప్రసరణ వ్యాధులతో 28.2 శాతం మంది, ఇన్‌ఫెక్షన్లతో 13.9 శాతం మంది కన్ను మూస్తున్నారు.
  • 45 ఏళ్లు దాటినవారిలో 35.3 నుంచి 40.8 శాతం వరకూ రక్తప్రసరణ వ్యాధులతో చనిపోతున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.