ETV Bharat / city

అధికార పార్టీ అని భరించాం.. ఇక మా వల్ల కాదు: సర్పంచ్​లు - ఆందోళన చేపడతామని సర్పంచ్​ల హెచ్చరిక

ప్రభుత్వం నుంచి నిధులు సక్రమంగా విడుదల కాకపోవడం వల్ల... పంచాయతీ సిబ్బంది విధులకు హాజరుకావడం లేదని మేడ్చల్​ మండల సర్పంచ్​లు ఆరోపించారు. ప్రభుత్వం స్పందించకపోతే... ఆత్మహత్యలే మార్గంగా కనిపిస్తున్నాయని వాపోయారు.

medchal mandal sarpunchula protest at sot office for funds release
అధికార పార్టీ కాబట్టి భరించాం.. మా వల్ల కాదు: సర్పంచ్​లు
author img

By

Published : Dec 23, 2020, 4:12 PM IST

మేడ్చల్ మండల సర్పంచ్​లు ఎస్​టీఓ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు. ప్రతి నెలా నిధులు ఫ్రీజ్ చేయడం వల్ల పంచాయితీ సిబ్బంది పనులకు హజరుకావటం లేదని ఆరోపించారు. పేరుకి మాత్రమే సర్పంచ్​లుగా ఉన్నామని... ఊర్లో మొహం ఎలా చూపించాలో తెలియట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఖరి మారకపోతే... ఆత్మహత్యలే దారి అన్నారు.

ఇది ఇలాగే కొనసాగితే రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్​లు అందరం కలిసి ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. మంత్రి మల్లారెడ్డి పర్యటనలో కూడా సర్పంచ్​లు పాల్గొనకుండా నిరసన వ్యక్తం చేశారు. సొంత పార్టీ అయినందున ఇన్ని రోజులు భరించామని... ఇప్పుడు సహనం కోల్పోయామని స్పష్టం చేశారు.

ఇదీ చూడండి: జాతికి వెలుగునిచ్చే చీకటి సూర్యులు సింగరేణి కార్మికులు: దత్తాత్రేయ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.