హైదరాబాద్ మల్లాపూర్‌లో అంబులెన్స్‌లో మృతి చెందిన గర్భిణి మరణంపై మేడ్చల్ ఇంఛార్జ్ కలెక్టర్ శ్వేతా మహంతి విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎంహెచ్ఓ... మృతురాలు పావని ఇంటికి వెళ్లి విచారణ జరుపుతున్నారు. ఆమె మృతిపై వివరాలు సేకరిస్తున్నారు.
శుక్రవారం రోజున పావనికి ఆయాసం రాగా ఆమె తల్లిదండ్రులు ఆస్పత్రికి వెళ్లారు. గర్భిణికి కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఆమెకు చికిత్స చేయడానికి ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. అనంతరం మరో నాలుగు ఆస్పత్రులకు వెళ్లినా ఎవరూ చేర్చుకోలేదు. చివరకు కోఠి ప్రసూతి ఆస్పత్రికి తరలిస్తుండగా పావని అంబులెన్స్‌లోనే మృతి చెందింది.
- సంబంధిత కథనం : అంబులెన్స్‌లో మృతిచెందిన గర్భిణికి అంత్యక్రియలు