ETV Bharat / city

Telangana Government Hospitals : అక్కడ రూ.5కే భోజనం.. ఉచిత వసతి సదుపాయం! - సర్కార్ దవాఖానాల్లో రోగుల సహాయకులకు ఉచిత వసతి

రోగుల వెంట సహాయకులుగా ఆస్పత్రులకు వెళ్లే వారు.. ఆహారం, వసతి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సకు స్థోమత లేక.. సర్కార్ దవాఖానాలకు వెళ్లేది పేదలే. మరి వారితో సహాయకులుగా వెళ్లిన వారు భోజనానికి, ఉండటానికి వసతిలేక.. వాటిని కొనుక్కునే స్థోమత లేక అవస్థలు పడుతున్నారు. వారి సమస్యను గుర్తించిన తెలంగాణ సర్కార్ ఓ బృహత్ ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. సర్కార్ దవాఖానా(Telangana Government Hospitals)ల్లో రోగులకు సహాయకులుగా వచ్చే వారి కోసం రూ.5లకే భోజనం, ఉండటానికి వసతి గృహాలు ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

Telangana Government Hospitals
Telangana Government Hospitals
author img

By

Published : Oct 14, 2021, 8:07 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగుల సహాయకుల కోసం అయిదు రూపాయలకే ఆహారాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం దవాఖానాల(Telangana Government Hospitals) పరిధిలో ఆహార పంపిణీ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. వాటిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనాలను కలిపి కేవలం రూ.15లకే అందజేయనున్నారు. ఈ ప్రక్రియలో ఇప్పటికే ప్రసిద్ధికెక్కిన ‘హరే కృష్ణ మూవ్‌మెంట్‌’ సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. వీటితో పాటు అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Telangana Government Hospitals) రోగుల సహాయకులు బస చేసేందుకు వీలుగా వసతిగృహాలనూ అందుబాటులోకి తీసుకొచ్చేందుకు వైద్యఆరోగ్యశాఖ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. ముందుగా హైదరాబాద్‌ పరిధిలోని దవాఖానాల్లో ప్రారంభించి, దశల వారీగా రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రులల్లోనూ ఈ వసతులను అమలు చేయనున్నట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే జీహెచ్‌ఎంసీ పరిధిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Telangana Government Hospitals) ఆహార కేంద్రాలను, వసతిగృహాలను నెలకొల్పడానికి అవసరమైన స్థల పరిశీలన పూర్తయింది.

రోజుకు 20వేల మందికి లబ్ధి

ఉస్మానియా, గాంధీ, పేట్లబురుజు ప్రసూతి ఆసుపత్రి, కోఠి ఈఎన్‌టీ, ఎంఎన్‌జే క్యాన్సర్‌ ఆసుపత్రి, సుల్తాన్‌బజార్‌ ప్రసూతి ఆసుపత్రి, ఛాతీ ఆసుపత్రి, మానసిక వైద్యశాలల్లోనూ నిత్యం వందల సంఖ్యలో రోగులు హాజరవుతుంటారు. వీటిల్లో నిత్యం ఓపీ సేవల్లోనే సుమారు 10వేల మందికి పైగా చికిత్స పొందుతుండగా.. వీరికి తోడుగా కనీసం ఒక్కొక్కరి చొప్పున చూసినా మరో 10వేల మంది ఆసుపత్రులకు వస్తుంటారు. అన్ని ఆసుపత్రుల్లోనూ రోగులకు ఉచిత ఆహారాన్ని సరఫరా చేస్తున్నారే కానీ.. వారి వెంట వచ్చిన సహాయకులు ఆసుపత్రి వెలుపలే సొంతంగా డబ్బు ఖర్చుపెట్టి తింటున్నారు. ఇందుకు ఒక్కో సహాయకుడికి రోజుకు కనీసం రూ.200 ఖర్చవుతోంది. వారం రోజుల పాటు రోగి ఆసుపత్రిలో ఉంటే.. సహాయకుడికి అయ్యే వ్యయమే సుమారు రూ.1,400 దాటుతోంది. ఓపీలో వైద్యసేవలకు వచ్చిన రోగులూ, వారి సహాయకులది ఇదే పరిస్థితి. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రోగులకు, వారి సహాయకులకు శుచి, శుభ్రతతో కూడిన నాణ్యమైన ఆహారం నామమాత్రపు ధరలకే అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం హరే కృష్ణ సంస్థ జీహెచ్‌ఎంసీ పరిధిలో సుమారు 150 ఆహార కేంద్రాల ద్వారా రోజుకు సుమారు 50వేల మందికి భోజనాలను పంపిణీ చేస్తోంది. ఒక్కో భోజనానికి కేవలం రూ.5 వసూలు చేస్తోంది. ఇదే తరహాలో ఆసుపత్రుల్లోనూ అల్పాహారానికి, మధ్యాహË్న, రాత్రి భోజనాలకు ఒక్కో దానికి కేవలం రూ.5 చొప్పున వసూలు చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు వైద్యవర్గాలు పేర్కొన్నాయి.

వసతిగృహాలకు అధిక ప్రాధాన్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో(Telangana Government Hospitals) రోగుల సహాయకులకు ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించిన నేపథ్యంలో.. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్యఆరోగ్యశాఖ చేపట్టింది. ఇక నుంచి కొత్తగా నిర్మించనున్న ఆసుపత్రులకు అనుబంధంగా సహాయకుల కోసం ప్రత్యేక భవనాల నిర్మాణానికి ఏర్పాట్లు చేయాలని నిర్ణయించింది. ప్రస్తుతమున్న ఆసుపత్రుల్లో ఈ తరహాలో నూతన నిర్మాణాలు వెంటనే సాధ్యం కాదు గనుక.. అందుబాటులో ఉన్న భవనాల్లోనే పురుషులు, మహిళలకు వేర్వేరు వసతి ఏర్పాట్లు చేయనున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా మరుగుదొడ్లను, స్నానాల గదులనూ అందుబాటులోకి తీసుకురానున్నారు. దసరా నాటికే ఆహార కేంద్రాలు, వసతిగృహాలను అందుబాటులోకి తీసుకురావాలని సంకల్పించినా.. మరికొద్ది రోజుల సమయం పట్టే అవకాశాలున్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.