దోమలు ఎక్కడినుంచో రావు... మన ఇల్లు, పరిసరాల్లోనే వృద్ధి చెందుతాయి కాబట్టి వాటి పెరుగుతదలను నివారించే బాధ్యత మనదేనని జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ అన్నారు. పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు... నగరంలో "ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు 10 నిముషాలు" కార్యక్రమంలో భాగంగా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పలుచోట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఖైరతాబాద్ జోన్ మెహదీపట్నం డివిజన్ మాసబ్‌ట్యాంక్‌లోని చాచా నెహ్రూ పార్కులోని నీటికొలనులో గంబూషియా చేపలు వదిలారు. పార్క్ పక్కనే ఉన్న డ్రైనేజీలో ఆయిల్ బాల్స్‌ను విడిచారు.
అనంతరం పోచమ్మ బస్తీలో పర్యటించి... ప్రజలకు దోమల వ్యాప్తి నివారణపై అవగాహన కల్పించారు. దోమల నివారణ ఆవశ్యకతను వివరించే... ఈ కార్యక్రమంలో ప్రతి కుటుంబాన్ని భాగస్వాములను చేసేందుకు జీహెచ్ఎంసీ ఎంటమాలజీ విభాగం ఆధ్వర్యంలో... నగర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కుటుంబ సభ్యుల ఆరోగ్యం, సీజనల్ వ్యాదుల నివారణ కోసం విధిగా ప్రతి ఒక్కరూ... ప్రతి ఆదివారం 10 నిమిషాలు కేటాయించి...ఇంటి పరిసరాల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించాలి. నిల్వవున్న నీటిలో దోమలు పెరిగే అవకాశం ఉన్నందున పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
-మేయర్ బొంతు రామ్మోహన్
ఇదీ చూడండి: ప్రగతిభవన్‌లో డ్రై డే.. పరిసరాలు శుభ్రపరిచిన మంత్రి కేటీఆర్