డెంగీ, సీజనల్ వ్యాధుల నివారణలో భాగంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ పంజాగుట్ట నిమ్స్ ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపట్టారు. ఆసుపత్రి ఆవరణలోని పూల కుండీలు, నీటి నిల్వలను మేయర్ తొలగించారు. సీజనల్ వ్యాధుల నివారణ కోసం విస్తృతస్థాయిలో చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మేయర్ వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో ఫాగింగ్, స్ప్రింగ్ పనులను రెట్టింపు చేసినట్లు పేర్కొన్నారు. అన్ని పాఠశాలల్లో ఫాగింగ్ చేయడంతో పాటు డెంగీపై అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నట్లు రామ్మోహన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ ఘంటా చక్రపాణి, నిమ్స్ డైరెక్టర్ మనోహర్, తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'తెలుగురాష్ట్రాలపై కేంద్రం చిన్నచూపు'