ఇటీవల నగరంలో కురిసిన భారీ వర్షాల కారణంగా... వరద ముంపునకు గురైన కాలనీలలో జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ పర్యటించారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్, మదీనాగూడలోని పలు కాలనీలలో బొంతు రామ్మోహన్ పర్యటించారు. ముంపునకు గురైన అపార్ట్మెంట్లను శానిటైజ్ చేయించారు. బాధితులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరికెపుడి గాంధీ, జీహెచ్ఎంసీ అధికారులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: ముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన