ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లాలో మావోయిస్టుల కదలికలు అధికంగా ఉండడం, నిత్యం ఏదో ఒక ప్రాంతంలో అలజడి రేపుతుండడం వల్ల... పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టారు. మావోల కదలికలను తెలుసుకునేందుకు వారు నిత్యం సంచరించే ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను వినియోగిస్తున్నారు.
ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం సుకుమా జిల్లా కిష్టారంపాడు పోలీస్‌స్టేషన్ పరిధిలోని పాలోడు గ్రామం వద్ద మావోయిస్టులు అటవీ మార్గంలో వాగు దాటుతున్న దృశ్యాలు డ్రోన్ కెమెరాకు చిక్కాయి. సుమారు 200 మందికి పైగా మావోలు దట్టమైన అడవిలో నడుస్తున్న దృశ్యాలు ఆ వీడియోలో రికార్డయ్యాయి.