హైదరాబాద్‌లోని జ్ఞానభూమిలో నిర్వహిస్తున్న పీవీ శతజయంత్యుత్సవాల్లో మాస్కులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా ప్రత్యేక మాస్కులను తయారు చేశారు. అయితే పీవీ జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో వాటిని రూపొందించారు. మేయర్ బొంతు రామ్మోహన్ సహా ఇతర ప్రజాప్రతినిధులు పీవీ బొమ్మతో ఉన్న మాస్కులను పెట్టుకుని వేడుకల్లో పాల్గొన్నారు.
ఇదీ చూడండి : పీవీ నరసింహారావుకు నివాళులర్పించిన సీఎం కేసీఆర్