ETV Bharat / city

కరోనా దెబ్బ: వాయిదా పడ్డ 20 వేల వివాహాలు - కోవిడ్ -19 తాజా వార్తలు

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులే కాదు.. ఆ తంతంతా లక్షలాది మందికి బతుకుదెరువు. పెళ్లి పేరుతో జరిగే హడావుడే అనేక కుటుంబాలకు ఉపాధినిస్తున్నాయి. ఈ సీజన్‌లో సుమారు 20వేల పెళ్లిళ్లు జరిగాల్సి ఉన్నప్పటికీ లాక్‌డౌన్‌ కారణంగా దాదాపు సగానికి పైగా.. వాయిదా పడ్డాయి. ఫలితంగా పురోహితులు, బ్యాండ్ మేళాల వారు, ఫోటో వీడియో గ్రాఫర్లు, టెంట్‌హౌస్‌, ఫంక్షన్‌ హాళ్ల యజమానులు, క్యాటరింగ్‌ వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Corona impact
కరోనా దెబ్బ
author img

By

Published : Apr 16, 2020, 11:32 AM IST

Updated : Apr 16, 2020, 2:06 PM IST

కరోనా దెబ్బ: వాయిదా పడ్డ 20 వేల వివాహాలు

ఏప్రిల్‌, మే మాసాల్లో లగ్గాలు ఎక్కువగా జరుగుతుంటాయి. అందుకే ఈ మాసాన్ని పెళ్లిళ్ల సీజన్ అంటారు. కానీ.. కరోనా దెబ్బకి చాలా మంది తమ పెళ్లిళ్లను వాయిదా వేసుకున్నారు. గ్రేటర్ పరిధిలో ఈ సీజన్‌లో సుమారు 20వేల వరకు వివాహాలు జరగాల్సి ఉండగా... అందులో చాలా వరకు వాయిదా వేసుకున్నారని పురోహితులు స్పష్టం చేస్తున్నారు.

అందరి ఆశలు పెళ్లిపైనే..

శ్రీరామనవమి పూర్తవ్వగానే పెళ్లిళ్లకు మంచి రోజులు ఉంటాయ్. ఈ సీజన్ కోసం పురోహితులు, టెంట్ హౌజ్ వాళ్లు, క్యాటరింగ్‌ వాళ్లు, ఫోటో వీడియో గ్రాఫర్‌లు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, బట్టల వ్యాపారులు, బంగారు వ్యాపారులు ఎదురు చూస్తుంటారు. వీరి ఆశలపై కరోనా నీళ్లు చల్లింది. టెంట్ హౌజ్‌నే నమ్ముకుని జీవనం సాగిస్తున్న వారిని కరోనా కొలుకోలేని దెబ్బ కొట్టింది. అసలే ఫంక్షన్ హాళ్లు రాకతో ఇప్పటికే బిజినెస్ సగానికి పడిపోయింది. ఇప్పుడు కరోనాతో మరింత నష్టపోవాల్సి వచ్చిందని టెంట్ హౌజ్ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఒక్కో పురోహితులు 20 నుంచి 25 పెళ్లిళ్లు..

కరోనా ప్రభావం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పురోహితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో పురోహితుడు ఈ మాసంలో దాదాపుగా 20 నుంచి 25 పెళ్లిళ్లు మాట్లాడుకుంటారు. ఇప్పుడు జరగాల్సిన వాటిలో సగానికి పైగా పెళ్లిళ్లు వాయిదా పడ్డాయి. గ్రేటర్‌ పరిధిలో ఫంక్షన్‌ హాళ్లు, కన్వెన్షన్‌ సెంటర్లు వెలవెలపోతున్నాయి. కేటరింగ్‌ సర్వీసుల్లో, బ్యాండ్‌ మేళాల్లో పని చేసే వాళ్లు ఉపాధిని కోల్పోయామంటున్నారు.

లగ్గాల సమయం..

ఏప్రిల్‌ 15,16,17 తేదీల్లో వేల సంఖ్యలో పెళ్లిళ్లు జరగాల్సినవి అని పురోహితులు పేర్కొంటున్నారు. ఏప్రిల్‌ 25, 26, 29, మే 1,3,6,7,13,17న కూడా లగ్గాలున్నాయంటున్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఈ తేదీల్లో జరగాల్సిన మనువులన్ని దాదాపుగా వాయిదా పడ్డాయంటున్నారు. జూలై, ఆగస్టు నెలల్లో కొన్ని ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు తెలిపారు.

అడ్వాన్సులు తిరిగి ఇవ్వాలంటూ..

పెళ్లిళ్లకు ఫోటో గ్రాఫర్లకు అవినాభావ సంబంధం ఉంది. అందమైన ఫోటోలు, వీడియోల కోసం వీళ్లు కావాల్సిందే. ఫోటో, వీడియో గ్రాఫర్‌లు ఏప్రిల్, మే, జూన్ నెలలో ఉండే లగ్గాలనే కీలకంగా భావిస్తారు. ఏడాదికి సంబంధించిన ఆదాయం ఈ మూడు నెలల్లో వస్తుందని వారు చెబుతున్నారు. మిగితా నెలల్లో ఆదాయం ఉన్నా, లేకున్నా వీటినే ఏడాది పొడవునా పొదుపుగా ఖర్చు పెట్టుకుంటామని చెబుతున్నారు. కల్యాణాలు వాయిదా పడగా తమ అడ్వాన్సులు తిరిగి ఇచ్చేయాలని బుక్ చేసుకున్న వాళ్లు ఒత్తిడి చేస్తున్నారని వాపోతున్నారు.

తీవ్ర నిరాశలో..

కరోనా ప్రభావంతో ఒక్కసారిగా ఇన్ని పెళ్లిళ్లు వాయిదా పడగా.. అడ్వాన్సులు తీసుకున్న ఫోటోగ్రాఫర్లు, ఫంక్షన్ హాళ్ల యజమానులు, పురోహితులు తీవ్ర నిరాశలో ఉన్నారు. అడ్వాన్సులు తిరిగి ఇవ్వమనకుండా... లగ్గమెప్పుడు చేసుకున్నా... తిరిగి తామే జరిపించేలా పెద్ద మనుసుతో ఒప్పుకోవాలని వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి: బడుగులపై కరోనా పిడుగు

Last Updated : Apr 16, 2020, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.