ప్రతిపక్షాలపై ప్రభుత్వం వైఖరిని కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్రెడ్డి విమర్శించారు. మాజీ ప్రధాని పీవీ శతజయంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళితే పోలీసులు అడ్డుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. స్వయంగా సీపీతో మాట్లాడినా.. రాష్ట్ర ప్రభుత్వ అధికార కార్యక్రమమైనందున ముఖ్యమంత్రి వచ్చి వెళ్లే వరకు ఎవరినీ అనుమతించడం లేదన్నారన్నారు. పోలీసుల వైఖరిని తప్పుబట్టడం లేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలను అడ్డుకోవడమే పనిగా ప్రభుత్వం పనిచేస్తోందని మండిపడ్డారు.
ఇవీచూడండి: హైదరాబాద్లో మరోసారి లాక్డౌన్..!