ETV Bharat / city

police: బాధితులతోనే పోలీసుల సెటిల్​మెంట్లు.. ఠాణాలే వేదికలు - telangana latest news

కొందరు పోలీసులు.. మొత్తం వ్యవస్థకే పేరు ప్రతిష్ఠలు తీసుకొస్తుంటే.. మరికొందరు మాయని మచ్చ తెస్తున్నారు. బాధితులను కాపాడాల్సిన వారే.. లంచాలు డిమాండ్​ చేస్తున్నారు. నేరుగా బాధితులతోనే సెటిల్​మెంట్​ చేసుకొంటున్నారు. ఇందుకు పోలీస్​స్టేషన్లూ వేదికలవుతున్నాయ్​. బాధితుల్లో కొందరు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తుండడం వల్ల .. సదరు పోలీసులు రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోతున్నారు.

telangana police
telangana police
author img

By

Published : Jul 7, 2021, 9:33 AM IST

బాధితులతోనే పోలీసుల సెటిల్​మెంట్లు.. ఠాణాలే వేదికలు

రాష్ట్రంలోని పలువురు పోలీసులు.. ఠాణాల్లోనే లంచం తీసుకొంటూ అనిశాకి చిక్కడం కలకలం రేపుతోంది. కొందరు పోలీసుల వల్లనే ఇలాంటి పరిస్థితి తలెత్తుతోందని ఉన్నతాధికారులే అంటున్నారు. తాజాగా మియాపూర్‌ ఎస్‌ఐ యాదగిరి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ పోలీస్‌స్టేషన్‌లోనే చిక్కారు. ఈ ఏడాది ఫిబ్రవరి 22న ఎస్​ఆర్​నగర్​ ఎస్​ఐ భాస్కర్‌రావు రేషన్​ బియ్యాన్ని అక్రమంగా రవాణా చేస్తున్న వ్యాన్​ను పట్టుకున్నారు. వాహనం తిరిగి ఇచ్చేందుకు డ్రైవర్​ మహ్మద్​ ఖాసీంను రూ.25 వేల లంచం డిమాండ్​ చేశారు. నగదును పోలీస్​స్టేషన్​లోనే ఇవ్వాలని చెప్పాడు. ఎస్​ఐ తీరుపై విసిగిపోయిన ఖాసీం.. ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. లంచం తీసుకుంటుండగా.. అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు.

గాంధీనగర్‌ ఎస్‌ఐగా పనిచేస్తున్న లక్ష్మీ నారాయణ, కానిస్టేబుల్‌ నరేష్‌... మోసం కేసులో ఒక వ్యక్తిని తప్పిస్తామంటూ లంచం డిమాండ్‌ చేశారు. రూ.30 వేలను పోలీస్​స్టేషన్​కు తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పారు. ఆ నగదు తీసుకుంటుండగా అప్పటికే అక్కడ వేచి ఉన్న ఏసీబీ వారిని పట్టుకొంది.

షాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ ఎస్​ఐ శంకరయ్య, ఏఎస్‌ఐ రాజేందర్‌ భూ వివాదానికి సంబంధించి కేసును పరిష్కరించేందుకు లంచం డిమాండ్‌ చేశారు. బాధితుడు రూ.1.20 లక్షలు ఇస్తానని అంగీకరించి.. అనంతరం అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. లంచం సొమ్ముతో బాధితుడు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఇస్తుండగా.. ఎస్​ఐ, ఏఎస్​ఐని ఏసీబీ అధికారులు అరెస్ట్​ చేశారు.

మొగల్‌పుర ఎస్‌ఐ బాబు ఓ కేసులో మహ్మద్‌ అబ్దుల్‌ రహీమ్‌ అనే వ్యక్తి నుంచి ఠాణాలోనే రూ.30 వేలు లంచం తీసుకుంటుండగా అనిశా బృందం దాడి చేసి పట్టుకుంది. జూబ్లీహిల్స్‌ ఎస్‌ఐ సుధీర్‌రెడ్డి.. స్టేషన్​లోనే రూ.50 వేలు, రెండు మద్యం సీసాలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడు వంశీకృష్ణకు సహరించేందుకు ఇన్​స్పెక్టర్​ బలవంతయ్య, ఎస్‌ఐ సుధీర్​ లక్ష రూపాయలు డిమాండ్‌ చేశారు. 50 వేలు ఇస్తానంటూ వంశీ చెప్పగా సరేనన్నారు. డబ్బు, మద్యం సీసాలు ఇస్తుండగా సుధీర్‌రెడ్డి అనిశాకు చిక్కాడు. అనంతరం బలవంతయ్య కోర్టులో లొంగిపోయాడు.

రాష్ట్ర ప్రభుత్వం పోలీస్​ వ్యవస్థ కోసం అత్యధిక నిధులు కేటాయిస్తూ, సంస్కరణలకు పెద్దపీట వేస్తుండగా.. కొందరు పోలీసులు మాత్రం లంచావతారులుగా మారుతున్నారు. ఈ పరిస్థితిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఇదీచూడండి: Vinod kumar: ఉన్నవాళ్లకే ప్రభుత్వ పథకాలు.. వినోద్​కుమార్​ను నిలదీసిన వృద్ధుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.