ETV Bharat / city

ఆ ప్రమాదాలకు కారణం ఎవరు.. మరణాలకు బాధ్యులెవరు? - Hyderabad drainage system problems

చినుకు పడితే భాగ్యనగర వాసుల్లో దడ మొదలవుతోంది. వర్షం కురిసినరోజు.. ఇళ్ల నుంచి బయటకు వెళ్లిన వారు తిరిగొస్తారా లేదోనని వారి కుటుంబ సభ్యులు భయాందోళనకు గురవుతున్నారు. పని మీద బయటకు వెళ్లిన వారు.. ఇంటికి వెళ్లడం కాస్త ఆలస్యమైనా.. వారు ఏ నాలాలో కొట్టుకుపోయారోనని వారి కుటుంబం పడే ఆందోళన వర్ణనాతీతం. గ్రేటర్​లోని నాలాల్లో పడి గడిచిన నాలుగు నెలల్లో ఎంతో మంది గల్లంతయ్యారు. మరికొంత మంది మృత్యువాత పడ్డారు. ఈ ప్రమాదాలకు కారణం ఎవరు? ఈ మరణాలకు బాధ్యత వహించేదెవరు?

ఆ ప్రమాదాలకు కారణం ఎవరు.
ఆ ప్రమాదాలకు కారణం ఎవరు.
author img

By

Published : Oct 11, 2021, 8:50 AM IST

గ్రేటర్‌ హైదరాబాద్​లో నాలాలు ప్రజల పాలిట యమపాశాలవుతున్నాయి. వివిధ శాఖల అలసత్వం ఏటా ఎంతోమంది ప్రాణాలను నిలువునా తోడేస్తోంది. నాలాల విస్తరణ, అభివృద్ధి, పూడికతీత పనుల్లో నిర్లక్ష్యం, మ్యాన్‌హోళ్ల మరమ్మతుల్లో అశాస్త్రీయ విధానాలు అమాయకులను బలి తీసుకుంటున్నాయి.

మణికొండలో ఇటీవల నాలాలో కొట్టుకుపోయి ఓ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి చెందగా.. అందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహిస్తుందని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. తాజాగా ఆదివారం తుకారాంగేట్‌ పరిధిలో వరద నీటి గుంతలో పడి ఓ రైల్వే ఉద్యోగి మృతి చెందారు. గడిచిన నాలుగు నెలల్లో ఆరుగురు ఇలా మృత్యువాత పడ్డారు. అలా మరికొన్నేళ్లు వెనక్కి వెళితే ఆ మరణాలు ఇంకెన్నో? వాటికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పగలరా?

ఈ మరణాలకు బాధ్యత ఎవరిది? చెప్పండి సారూ.. వినాలని ఉంది..
ప్రమాదాలు జరిగిన ప్రాంతాలు

1

తేదీ: జూన్‌ 5, 2021

బోయిన్‌పల్లి ఆనంద్‌నగర్‌ కాలనీ పైకప్పు లేని నాలాలో పడి ఏడేళ్ల బాలుడి మృతి

కారణం: పనుల్లో ఇంజినీర్ల నిర్లక్ష్యం

తాజా పరిస్థితి: నాలాకు ఒకవైపు జాలీ ఏర్పాటు, మరోవైపు ఇంకా పూర్తి చేయలేదు.

2

తేదీ: ఆగస్టు 3, 2021

బీఎన్‌రెడ్డి నగర్‌లోని సాహెబ్‌నగర్‌ పద్మావతి కాలనీలో మ్యాన్‌ హోల్‌లోకి దిగి ఇద్దరు కార్మికుల మృతి

కారణం: నిర్లక్ష్యంగా చేపట్టిన పనులు

తాజాస్థితి: మృతదేహాన్ని వెతికేందుకు కాలనీ పొడవునా పైపులైను తవ్వేశారు. ఆ పనులు ఇప్పటికీ పూర్తి చేయలేదు.

3

తేదీ: ఆగస్టు 13, 2021

అహ్మద్‌నగర్‌ డివిజన్‌, బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 1

బుల్కాపూర్‌ నాలాలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కారణం: పూడికతీత కోసం నాలాకు ఇరువైపులా ఉన్న రక్షణ గోడ తొలగించడం.

తాజా పరిస్థితి: ఇప్పటికీ ఆ ప్రాంతంలో రక్షణ గోడ నిర్మించలేదు.

4

తేదీ: సెప్టెంబరు 25, 2021, మణికొండ వద్ద నాలాలో పడి సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు మృతి

కారణం: నాలాకు పైకప్పు, జాలీ లేకపోవడం వల్ల ప్రమాదం.

తాజాస్థితి: ప్రమాదానికి బాధ్యత వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయినా ఇప్పటికీ ఘటన జరిగిన ప్రాంతంలో పనులు ఇంకా పూర్తి చేయలేదు.

5

తేదీ: సెప్టెంబరు 25, 2021

కుత్బుల్లాపూర్‌ గణేష్‌ టవర్స్‌ ప్రాంతం

మూత్ర విసర్జనకు వెళ్లి నాలాలో వ్యక్తి గల్లంతు.

కారణం: నాలాకు జాలీ లేదు

తాజాస్థితి: ఇప్పటికీ అతని ఆచూకీ దొరకలేదు. ఆ ప్రాంతంలో ఎలాంటి దిద్దుబాటు చర్యలూ చేపట్టలేదు.

6

తేదీ: అక్టోబరు 16, 2018

బోరబండ సాయిబాబా ఆలయ ప్రాంతం

ఘటన: ఓ వ్యక్తి వరద నాలాలో పడి దుర్మరణం

తాజాస్థితి: ఏడాది తరువాత కుటుంబానికి పరిహారమిచ్చారు. నాలా అభివృద్ధి పనులు పూర్తికాలేదు.

7

తేదీ: సెప్టెంబరు 9, 2018

సరూర్‌నగర్‌లో నాలాలో పడి హరీష్‌ అనే యువకుడు మృతి

కారణం: నాలాకు పైకప్పు లేదా జాలీ లేదు.

తాజాస్థితి: మృతుడు స్థానికుడు కానందున పరిహారం అందలేదు.

8

ఏడాది: 2016

సికింద్రాబాద్‌లో ఉప్పల్‌ స్టాప్‌ వద్ద నాలాలో పడి గర్భవతి మృతి.

కారణం: కూడలిలో రైల్వే లైను పక్క నుంచి వెళ్లే ఈ నాలాపై పైకప్పు లేదు.

తాజాస్థితి: ప్రస్తుతం పై కప్పు ఏర్పాటు చేసినా ఆ ప్రాంతం ఇంకా ప్రమాదకరంగానే ఉంది.

9

తేదీ: నవంబరు 4, 2020

కోదండరామ్‌ నగర్‌ వద్ద నాలాలో పడి వృద్దురాలి మరణం

కారణం: నాలాకు జాలీ లేదు

తాజాస్థితి: ఆ తరువాత అధికారులు నాలాకు జాలీ ఏర్పాటు చేయించారు.

10

తేదీ: సెప్టెంబరు 25, 2019

నాగోల్‌ ఆదర్శ్‌ నగర్‌ రహదారిపై నాలాలో పడి వ్యక్తి మృతి

కారణం: నాలాపై కప్పు లేదు

తాజాస్థితి: ఫ్లైఓవర్‌ పనుల నేపథ్యంలో అక్కడ నాలా అభివృద్ధి పనులు పూర్తి చేశారు.

11

తేదీ: జూన్‌ 10, 2018

మల్కాజి గిరిలో ఓపెన్‌ నాలాలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి

కారణం: నాలా అభివృద్ధి పనులు అర్ధాంతరంగా ఆగిపోవడం

తాజాస్థితి: ఘటన అనంతరం పనులు పూర్తి చేశారు.

12

తేదీ: మార్చి 20, 2020

పీర్జాదిగూడలో బిడ్డతో సహా మురుగు నీటి గుంతలో పడిన మహిళ (అప్రమత్తమై స్థానికులు కాపాడారు)

కారణం: పైపులైన్‌ కోసం గుంత తవ్వినా ఎలాంటి రక్షణ చర్యలు లేకపోవడం

తాజాస్థితి: ప్రమాదం తరువాత పనులు పూర్తి చేశారు.

13

తేదీ: సెప్టెంబరు 17, 2020

నేరేడ్‌మెట్‌లో నాలాలో కొట్టుకుపోయి 12 ఏళ్ల సుమేధ మృతి

కారణం: నాలాకు పైకప్పు లేకపోవడం

తాజాస్థితి: రూ.400 కోట్లతో నగరవ్యాప్తంగా నాలాలకు పైకప్పులు, జాలీలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. పనులు ఇంకా మొదలు కాలేదు.

పరిష్కారాలు..

వర్షాకాలానికి ముందు నాలాల పొడవునా తనిఖీలు చేపట్టాలి. జాలీలు, పైకప్పు ఏర్పాటు చేయాలి.

గుత్తేదారులు పూడిక తీత పనుల కోసం జాలీలు తొలగిస్తున్నారు. కాలనీవాసులు నాలాల్లో చెత్త వేసేందుకు కల్వర్టుల వద్ద జాలీలను తొలగిస్తున్నారు. ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.

నాలా విస్తరణ, అభివృద్ధి పనుల కోసం తవ్వకాలు చేపట్టి బారికేడ్లు ఏర్పాటు చేయడం లేదు. బిల్లులు రావడం లేదని కాంట్రాక్టర్లు ఏళ్ల తరబడి ఆ పనుల వద్ద బారికేడ్లు, రక్షణ గోడలు నిర్మించడం లేదు. వీటిపై ప్రభుత్వం దృష్టి సారించాలి.

1400 కి.మీ. నగరంలో నాలాల పొడవు

830 కి.మీ. అందులో పైకప్పు లేనివి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.