ETV Bharat / city

లక్షణాల్లో తికమక.. ఆఖరి నిమిషంలో ఆగమాగం - తెలంగాణ తాజా వార్తలు

రెండో దశ విజృంభణలో కరోనా ముప్పుతిప్పులు పెడుతోంది. అత్యధిక శాతం లక్షణాలు లేకపోవడం.. ఉన్నట్టుండి అత్యవసర స్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న వైరస్​ వ్యాప్తి.. అవగాహన లోపం అనేక మందిని పొట్టనపెట్టుకుంటోంది.

covid mutations
ముప్పుతిప్పులు పెడుతున్న రెండో దశ కొవిడ్​
author img

By

Published : Apr 28, 2021, 9:03 AM IST

కరోనా కలవరంతో పరిచయస్తులు, స్నేహితులు, బంధువులను అనుమానించాల్సిన పరిస్థితి. రెండోదశలో 70 నుంచి 80 శాతం మందిలో వ్యాధి లక్షణాలు లేకపోవటం.. వైద్యపరీక్షల్లో కచ్చితత్వంపై నెలకొన్న అనుమానాలు దీనికి కారణమంటున్నారు వైద్యనిపుణులు. కొవిడ్‌ లక్షణాలు ఉండి ఆర్టీపీసీఆర్‌ పరీక్షలో మొదటిసారి నెగెటివ్‌ వస్తే మరోసారి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు సీసీఎంబీ శాస్త్రవేత్తలు. అప్పుడు కూడా నెగెటివ్‌ వస్తే కరోనా లేనట్లు నిర్ధారించుకోవాలని సూచించారు. పెరుగుతున్న కేసులు, అవగాహన లోపంతో ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. అరకొర పరిజ్ఞానం, స్థానికంగా ఉండే ఆర్‌ఎంపీల వైద్యంతో తాత్కాలిక ఉపశమనం కోసం మందులు వాడుతున్నారు. పేదవర్గాలు ఉండే కాలనీలు, శివారు ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఫలితం దక్కలేదు..

ఆయన వయసు 55 ఏళ్లు. వ్యవసాయంలో కాయకష్టం చేస్తూ పుష్టిగానే ఉన్నాడు. కాస్త దగ్గు, జ్వరం అనిపిస్తే యాంటిజెన్‌, ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయించారు. రెండూ నెగెటివ్‌ నివేదిక వచ్చాయి. నాలుగు రోజుల తరువాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవటంలో ఇబ్బంది తలెత్తింది. కార్పొరేట్‌ ఆసుపత్రికి తరలించి వైద్యం అందించినా ఫలితం దక్కలేదు. 20 మంది కుటుంబ సభ్యులున్న ఆయన అంత్యక్రియలు అనాథగా జరిపించాల్సి వచ్చిందని బంధువులు ఆవేదన వెలిబుచ్చారు.

14 రోజులవుతున్నా పాజిటివ్‌

గచ్చిబౌలికి చెందిన ఆయన ఓ ఐటీ నిపుణుడు. ప్రముఖ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్నారు. 20 రోజుల కిందట కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. 14 రోజుల తర్వాత వరుసగా మూడుసార్లు వైద్యపరీక్షలో కరోనా పాజిటివ్‌గానే నివేదిక వచ్చింది. ఎలాంటి లక్షణాలు లేవు. సిటీ స్కాన్‌ పరీక్ష పరిశీలించిన వైద్యులు ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉన్నట్లు నిర్ధారించారు. ఇంతకీ తాను పాజిటివా, నెగెటివా అనే సందిగ్ధతలో మానసికంగా కుంగిపోతున్నాడు.

సెలవు కావాలంటే రిపోర్టు ఉండాల్సిందే..

ఇటీవల ప్రభుత్వ ఉద్యోగి ఒకరికి ఒంటినొప్పులు, చికాకుగా అనిపిస్తే వైద్యపరీక్ష చేయించుకొన్నారు. కరోనా లేదని నివేదిక వచ్చింది. కుటుంబ సభ్యులకు దూరంగా మరో గదిలోకి మకాం మార్చారు. ఉన్నతాధికారి వద్దకెళ్లి సెలవు కావాలని అడగ్గా.. కొవిడ్‌ పాజిటివ్‌ నివేదిక ఉంటేనే అంటూ మెలికపెట్టారు. మరో రెండ్రోజుల తర్వాత పరీక్షకు వెళ్లిన సదరు ఉద్యోగికి పాజిటివ్‌ అని నిర్ధారణైంది. అప్పటికే సహోద్యోగులు ఎంతమంది వైరస్‌ బారిన పడ్డారో అనేది ఆందోళన కలిగిస్తోంది. కొన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో స్వల్ప లక్షణాలుండి నివేదికలో నెగెటివ్‌ వస్తే విధులకు రమ్మని ఒత్తిడి చేస్తున్నారంటూ ఓ ప్రభుత్వ ఉద్యోగి ఆవేదన వెలిబుచ్చారు. చిన్నతరహా పరిశ్రమలు, షాపింగ్‌మాల్స్‌, సినిమా థియేటర్లు తదితర జనసమ్మర్థం ఉండే చోట్ల పనిచేసే ఇటువంటి వారితో మరింత ముప్పు ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

ఇవీచూడండి: '18 ప్లస్​'కు టీకా రిజిస్ట్రేషన్.. నేటినుంచే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.