లాక్‌డౌన్‌తో ఉపాధి కోల్పోయిన రోజువారీ కూలీల కుటుంబాలకు నిత్యవసర సరకులను అందించేందుకు ప్రభుత్వం రేషన్ బియ్యం పంపిణీ చేస్తోంది. సర్కారు సాయానికి చేదోడుగా కొన్ని స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు కంపెనీలు మేము సైతం అంటూ ఈ క్రతువులో భాగస్వాములవుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన కింగ్స్ గ్రూపు నగరంలోని 15 ప్రాంతాలలో నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరకులతో కూడిన కిట్‌ను వాడవాడలా తిరుగుతూ అందించింది.
బియ్యం, పప్పు, ఉప్పు, నూనె, కారం, పసుపుతో కూడిన సంచిని పూరి గుడిసెలు, వెనుకబడిన బస్తీలలో తిరుగుతూ పంపిణీ చేశారు. ఆపత్కాలంలో నిరుపేదలను ఆదుకుంటున్నారు. సమాజంలో మెరుగైన జీవనం గడుపుతున్న వారు నిరుపేదలను ఆదుకునేందుకు ముందుకు రావాలని వారు కోరారు.
ఇవీచూడండి: లాక్‌డౌన్‌తో మూగజీవాలకు కష్టకాలం