పెళ్లికి నిరాకరించాడని ప్రియుడిపై యువతి దాడి చేసిన ఘటన ఏపీలోని కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం వక్కలగడ్డలో సంచలనం రేపింది. అనంతరం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్యురకారం యువతి ఓ ప్రైవేటు కళాశాలలో లెక్చరర్ గా పనిచేస్తోంది. యువకుడు తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇరువురికి పరిచయం ఉండటంతో పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి తెచ్చింది.
అందుకు తిరస్కరించాడు ప్రియుడు. చివరిసారిగా కలిసి మాట్లాడుకుని విడిపోదామంటూ పిలిచింది. సరేనంటూ వక్కలగడ్డ వెళ్లన తనపై ఒక్కసారిగా కత్తితో దాడి చేసిందని...యువకుడు పోలీసులకు తెలిపాడు. యువతి అపస్మారక స్థితిలోకి వెళ్లటంతో మచిలీపట్నం ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!