ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల పేరుతో మోసం చేస్తున్న ఓ వ్యక్తిని విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. గవర్నర్ బంగ్లా సమీపంలో... సన్‌రైజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీ పేరుతో శ్రీనివాస్ అనే వ్యక్తి కొంతకాలంగా ఉద్యోగాల పేరిట ఆశ చూపి నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేశాడు. ఎంతకీ ఉద్యోగాలు రాకపోవటంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. సుమారు 20మంది బాధితుల నుంచి రూ.50లక్షలు వసూలు చేసినట్లు శాంతి భద్రతల డీసీపీ రంగారెడ్డి వివరించారు. నిందితునిపై ఇప్పటికే విజయవాడ, విజయనగరం పోలీస్ స్టేషన్లలో కేసులు ఉన్నట్లు డీసీపీ తెలిపారు. నిందితుడి వద్ద రూ.7లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: జాయింట్ కలెక్టర్‌ను...భూములు క్రమబద్ధీకరణ చేయిస్తా!