ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వివాదాస్పద పెగాసస్ సాఫ్ట్వేర్ను కొనుగోలు చేశారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెల్లడించారు. ఈ మేరకు ఆమె బుధవారం బెంగాల్ అసెంబ్లీలో మాట్లాడుతూ... 'నాలుగైదేళ్ల క్రితం పెగాసస్ సాఫ్ట్వేర్ను రూ.25 కోట్లకు విక్రయిస్తామంటూ దాని సృష్టికర్తలు బెంగాల్ పోలీసులను సంప్రదించారు. విషయం నాకు తెలిసిన వెంటనే తిరస్కరించాను. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం దానిని కొనుగోలు చేసింది' అని వివరించారు.
ఇదీ చూడండి: Sexual Harassment: ఫేస్బుక్ పరిచయం.. కోరిక తీర్చమంటూ బెదిరింపు!