ఆంధ్రప్రదేశ్లోని వైఎస్ఆర్ జిల్లా ఖాజీపేట మండలం అప్పన్నపల్లి గ్రామ సచివాలయానికి గుత్తేదారు తాళం వేశారు. సచివాలయ భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా.. అధికారులు బిల్లులు చెల్లించలేదనే కారణంతో గుత్తేదారు వాసుదేవరెడ్డి ఇవాళ ఉదయం సచివాలయానికి తాళం వేశారు. రూ.48 లక్షలతో సచివాలయం నిర్మించినట్లు చెప్పారు. రెండేళ్లు అవుతున్నా పంచాయతీ అధికారులు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయాన్ని 2020 అక్టోబర్ 2న మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రారంభించారన్నారు. అప్పటి నుంచి పలుమార్లు అధికారులను కలిసి బిల్లులు చెల్లించాలని అడిగినా స్పందన లేదని వాపోయారు.
తనకు బిల్లులు చెల్లించే వరకు సచివాలయం తలుపులు తెరిచే ప్రసక్తే లేదని వాసుదేవరెడ్డి తేల్చి చెప్పారు. దీంతో సచివాలయానికి విధుల నిర్వహణకు వచ్చిన ఉద్యోగులు సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు. మరోవైపు వారం క్రితం ప్రకాశం జిల్లా ఇండ్లచెరువు గ్రామానికి చెందిన గుత్తేదారు కూడా ప్రభుత్వం బిల్లులు చెల్లించట్లేదని ఇండ్లచెరువు గ్రామ సచివాలయానికి తాళం వేసిన విషయం తెలిసిందే.
ఇవీ చూడండి..
కేసీఆర్ నోట.... ''భారత రాష్ట్ర సమితి'
SSC Paper Leak: నంద్యాల జిల్లాలో పది ప్రశ్నాపత్రం లీక్.. చిత్తూరు జిల్లాలో వదంతులు