శ్రీశైలం ఎడమగట్టు భూగర్భ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో అగ్ని ప్రమాదంపై సీబీఐ విచారణ జరిపించాలని... మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి పార్లమెంటులో కోరారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంతోనే... ఆగస్టు 20న అగ్ని ప్రమాదం జరిగినట్టు ఆరోపించారు. ఆ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలను... ముఖ్యమంత్రి పరామర్శించకపోగా... కనీసం భరోసా కూడా ఇవ్వలేదని విమర్శించారు.
తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో ఉన్న ఈ ప్రాజెక్టు నిర్వహణకు... ప్రభుత్వం నిధులు కేటాయించలేదని వివరించారు. 900 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ఆ ప్రాజెక్టు... వందల కోట్ల ఆస్తులు కలిగి ఉందని తెలిపారు. ఈ కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1500 కోట్లు ఆదాయం వస్తోందని రేవంత్ వివరించారు.
ఇదీ చూడండి: సచివాలయం కూల్చివేతపై సుప్రీంకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్