మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా చిత్రకారులు ఆయనకు వినూత్న రీతిలో నివాళి అర్పిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదరావూరుకు చెందిన ఉపాధ్యాయుడు వెంకటకృష్ణ గాంధీ చిత్తరువుని ఆకుపై చిత్రించారు. కదంబం చెట్టు నుంచి ఆకు సేకరించి, దానిపై బాపు చిత్రాన్ని రూపొందించారు.
తూర్పుగోదావరి జిల్లా రంగపేటకు చెందిన సైకత శిల్పి దేవిని శ్రీనివాస్ సబ్బుపైన మహాత్ముని ఆకృతిని తీర్చిదిద్దారు. సుమారు నాలుగు గంటలపాటు శ్రమించి కళాకృతిని రూపొందించారు. పి.గన్నవరానికి చెందిన పేరిచర్ల సత్యవాణి అనే గృహిణి బియ్యపు గింజలతో బాపూ చిత్రాన్ని తీర్చిదిద్దారు.