శ్రీవారి దర్శనార్థం మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ శుక్రవారం రాత్రి ఏపీలోని తిరుమలకు చేరుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో తిరుపతి విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో కొండపైకి చేరుకున్నారు. పద్మావతి అతిథి గృహం వద్ద అదనపు ఈవో ధర్మారెడ్డి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు స్వాగతం పలికారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభదర్శన సమయంలో స్వామివారిని దర్శించుకుని.. అనంతరం సుందరకాండ పారాయణంలో పాల్గొన్నారు.
ఇదీ చదవండి: పాక్షిక వర్ణ అంధత్వమున్నా డ్రైవింగ్ లైసెన్స్