ETV Bharat / city

Luggage Charges Hike in TSRTC : లగేజీ ఛార్జీలు భారీగా పెంచేసిన టీఎస్‌ఆర్టీసీ - టీఎస్‌ఆర్టీసీలో లగేజీ ఛార్జీల పెంపు

Luggage Charges Hike in TSRTC : మాటిమాటికి ఆర్టీసీ బస్సు ఛార్జీలు పెంచుతున్న తెలంగాణ ఆర్టీసీ ఈసారి లగేజీ ఛార్జీలు పెంచింది. ఈ ఛార్జీలను భారీగా పెంచుతూ టీఎస్‌ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి.

Luggage Charges Hike in TSRTC
Luggage Charges Hike in TSRTC
author img

By

Published : Jul 20, 2022, 6:54 AM IST

Luggage Charges Hike in TSRTC : ఆర్టీసీ బస్సుల్లో ఇకనుంచి టైర్లు తీసుకెళ్లాలంటే మూడింతలు, సైకిల్‌కైతే రెండింతల లగేజీ ఛార్జీ చెల్లించాల్సిందే. ఈ ఛార్జీలను భారీగా పెంచుతూ తెలంగాణ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త ఛార్జీలు శుక్రవారం నుంచి అమలులోకి రానున్నాయి. ఇటీవల రెండు దఫాలుగా సెస్సులు తదితరాల పేరుతో ప్రయాణికుల ఛార్జీలను పెంచగా.. తాజాగా లగేజీ ఛార్జీలనూ ఆర్టీసీ గణనీయంగా పెంచింది.

లగేజీ ఛార్జీల వివరాలు

‘‘లగేజీ ఛార్జీలు సుదీర్ఘకాలంగా ఒకేలా ఉన్న అంశంపై ఇటీవల జరిగిన టాస్క్‌ఫోర్స్‌ సమావేశంలో చర్చ జరిగిన నేపథ్యంలో వాటిని పెంచాలని నిర్ణయం తీసుకున్నాం. 2002 తర్వాత ఈ ఛార్జీలను పెంచిన దాఖలాలు లేవు. డీజిల్‌ ధరలతో పాటు మానవ వనరుల వ్యయాలు పెరగటంతో వాటినీ పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ కార్గో సేవలను ప్రోత్సహించేందుకు ఆ ఛార్జీలతో సమానంగా లగేజీ ఛార్జీలను పెంచాం’’ అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో

ఆర్టీసీ బస్సుల్లో ట్రక్కు టైర్లు తరలించాలంటే ఇకపై 3యూనిట్లుగా పరిగణించి ఛార్జీలు వసూలుచేస్తారు. టీవీ, ఫ్రిజ్‌, సైకిల్‌, ఫిలింబాక్సులు, వాషింగ్‌ మెషీన్‌, కార్‌ టైర్లను రెండు యూనిట్లుగా, రేడియో, ఖాళీ బ్యాటరీ, టేబుల్‌ ఫ్యాన్‌, 25 లీటర్ల ఖాళీక్యాన్‌, కంప్యూటర్‌ మానిటర్‌, సీపీయూ, హార్మోనియంలను ఒక యూనిట్‌గా పరిగణిస్తారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.