మధ్య భారత ప్రాంతంలో యాంటీ సైక్లోన్ సర్క్యులేషన్ ఏర్పడిందని... దీని ప్రభావంతో ఈశాన్య దిక్కు నుంచి చలిగాలులు వీస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. మూడు నాలుగు రోజులుగా చలి తీవ్రత అధికంగా ఉందని... రాగల రెండు రోజులపాటు కూడా చలి తీవ్రత కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ సంచాలకురాలు నాగరత్న వెల్లడించారు.
కరోనా నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని... ఆస్తమా, కీళ్లనొప్పుల బాధితులు అప్రమత్తంగా ఉండాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. తగు జాగ్రత్తలు తీసుకుని బయటకు రావాలని ప్రజలకు సూచిస్తున్నారు. యాంటీ సైక్లోన్ సర్క్యులేషన్ బలహీనపడిందని... దీని ప్రభావంతో రెండు రోజుల తర్వాత చలి తీవ్రత తగ్గుతుందని తెలిపారు. ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో మాత్రం చలి తీవ్రత కొనసాగుతుందంటున్న నాగరత్నతో ఈటీవీ భారత్ ప్రతినిధి జ్యోతికిరణ్ ముఖాముఖీ...
ఇదీ చూడండి: క్రైస్తవులకు గవర్నర్, సీఎం క్రిస్మస్ శుభాకాంక్షలు