ETV Bharat / city

విశాఖ ఉక్కుపై కొవిడ్ ప్రభావం

కరోనా వైరస్ దెబ్బకు ఏపీ విశాఖ ఉక్కు కర్మాగారం విలవిల్లాడుతోంది. నిర్మాణ రంగం స్తంభించడంతో 6 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి పేరుకుపోయింది. చేసేదేమీలేక మొత్తం 3 ఫర్నేస్‌ల్లో రెండింటిని నిలిపివేశారు. ఇప్పటిదాకా.. దాదాపు 1500 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

CORONA EFFECT ON VISHAKA STEEL PLANT
విశాఖ ఉక్కుపై కోవిడ్ ప్రభావం
author img

By

Published : Apr 19, 2020, 2:44 PM IST

కరోనా వైరస్‌ ఆంధ్రప్రదేశ్ విశాఖ ఉక్కు కర్మాగారంపై తీవ్ర ప్రభావమే చూపిస్తోంది. దాదాపు 35 వేల మంది ఉద్యోగులున్న ఈ కర్మాగారంలో ఉత్పత్తిని అనివార్యంగా కనిష్ట స్థాయికి తెచ్చారు.మొత్తం మూడు బ్లాస్ట్ ఫర్నేస్‌లు ఈ ఉక్కుకర్మాగారంలో ఉండగా ఒక దానిలోనే ఉత్పత్తి జరుగుతోంది. అసలే సంక్షోభంలో ఉన్న ఉక్కు ఉత్పత్తి రంగం కొవిడ్ ప్రభావంతో పూర్తిగా కుదేలైపోయింది. లాక్ డౌన్ వల్ల నిర్మాణ రంగం నిలిచి పోవడం ఉక్కు ఉత్పత్తుల కొనుగోళ్లు ఆగిపోయాయి. విశాఖ ఉక్కు కర్మాగారానికి దేశ వ్యాప్తంగా 24 స్టాక్ యార్డులున్నాయి. వీటిలో ఎక్కడి సరకు అక్కడే నిలిచిపోయింది. విశాఖ కర్మాగారంలోనే 5నుంచి 6లక్షల టన్నుల ఉక్కు పేరుకుపోయింది. టన్ను కనిష్టంగా 36 వేల రూపాయిలు అనుకున్నా దాదాపు 1800 కోట్ల రూపాయిల సరకు అమ్మకం కోసం ఎదురు చూడాల్సిన స్ధితి నెలకొంది.

విశాఖ కర్మాగారంలో నిలిపివేసిన రెండు బ్లాస్ట్ ఫర్నేస్‌లలో ఉత్పత్తి తిరిగి ఆరంభం కావడానికి కనీసం వారంపైనే పడుతుంది. లౌక్‌డౌన్ కాలంలో నిలిచిన ఉత్పత్తి చెల్లించాల్సిన బిల్లులు, జీత భత్యాలు వెరసి ఉక్కు కర్మాగారాన్ని మరింత ఆర్థిక కష్టాల్లోకి నెట్టేసేలా... ఉన్నాయి. నిర్మాణ రంగం మళ్లీ గాడిలో పడి ఉక్కు అమ్మకాలు జోరందుకునే నాటికి ఇప్పుడున్న పరిస్ధితుల దృష్ట్యా కనీసం 1500 కోట్ల రూపాయల నష్టం తప్పేట్టు లేదని పరిశ్రమవర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఇవీ చూడండి: సడలింపులు ఇవ్వాలా.. వద్దా.. నేడు కేబినెట్ భేటీ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.