ETV Bharat / city

సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..

మహాశివరాత్రి పురష్కరించుకుని శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి. వేకువజాము నుంచే శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. అభిషేక ప్రియుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తూ భక్తిని చాటుకుంటున్నారు.

shiva
shiva
author img

By

Published : Feb 21, 2020, 12:41 PM IST

Updated : Feb 21, 2020, 2:53 PM IST

సర్వం శివమయం.. శివాలయాల్లో భక్తజన సందోహం..

మహాశివరాత్రి వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. మహాశివుని దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శైవక్షేత్రాలు శివనామ స్మరణతో మారుమోగుతున్నాయి.

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ రాజన్న సన్నిధి భక్తులతో కిటకిటలాడుతోంది. స్వామి వారి దర్శనం కోసం తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి చూస్తున్నారు. పుణ్యస్నానాలు ఆచరించి... కోడె మొక్కులు చెల్లించుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన, రాత్రి 11.30 గంటలకు మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. ధర్మపురి, కోటిలింగాలకు భక్తులు పోటెత్తారు. గోదావరిలో భక్తులు పుణ్యాస్నానాలు ఆచరించి.... మహారుద్రునికి ప్రత్యేక పూజలు చేశారు.

హన్మకొండ వేయిస్తంభాల ఆలయంలో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. భక్తులు భారీగా చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివుడిని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్​రావు, సత్యవతి రాఠోడ్‌ దర్శించుకున్నారు. ఐనవోలు శ్రీ మల్లికార్జున స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ములుగు జిల్లా పాలంపేట రామప్ప రామలింగేశ్వరస్వామి దేవాలయం శివ నామస్మరణతో మారు మోగింది. కాళేశ్వరంలో వైభవంగా మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్నాయి. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు పూజలు నిర్వహించారు. కాళేశ్వర ముక్తీశ్వరస్వామి దర్శనానికి భక్తులు బారులుతీరారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని దుర్కి సోమలింగేశ్వరాలయంలో సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. మహాశివరాత్రి దర్శనాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శివాలయాలు కిటకిటలాడాయి. ఖమ్మం మండలం తీర్థాల సంగమేశ్వరస్వామి ఆలయంలో పెద్దజాతర నిర్వహించారు. ఈ జాతర మూడు రోజుల పాటు కొనసాగనుంది. మధిర శ్రీమృత్యుంజయ స్వామి ఆలయంలో వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. వైరా మండలం స్నానాల లక్ష్మీపురంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. భద్రాచలంలో గోదావరి ఒడ్డున ఉన్న శివాలయంలో అభిషేక మహోత్సవం జరిగింది. గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి.. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని శైవ క్షేత్రాలు శివనామస్మరణతో మారు మోగుతున్నాయి. మేళ్లచెరువులో శ్రీ శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామిని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ కుమార్ రెడ్డి దర్శించుకున్నారు. అగస్తేశ్వర స్వామిని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు దర్శించుకున్నారు. సూర్యాపేట జిల్లా చారిత్రక పిల్లలమర్రి ఆలయంలో ప్రత్యేక పూజలు చేపట్టారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రముఖ ప్రాచీన శైవ క్షేత్రం కందూరు రామలింగేశ్వర స్వామి ఆలయంలో శివరాత్రి మహోత్సవాలు ఘనంగా సాగుతున్నాయి. స్వయం భూగ వెలసిన రామలింగేశ్వర స్వామి ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల సోమేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. సిద్దిపేటలోని పార్వతి కోటిలింగేశ్వర స్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో శివాలయంలో అభిషేకాలు చేశారు.

మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆదిలాబాద్‌ జిల్లాలో శైవక్షేత్రాలు జనసంద్రంగా మారాయి. జిల్లా కేంద్రంలోని ఉమామహేశ్వర ఆలయంలో శివనామస్మరణలో భక్తులు మునిగితేలారు. మంచిర్యాల జిల్లా మందమర్రి, చెన్నూర్, జైపూర్, కోటపల్లి భీమారం మండలాల్లో భక్తులు భక్తి శ్రద్ధలతో మహాదేవుని వేడుకలు జరుపుకుంటున్నారు. గోదావరిలో పుణ్య స్నానాలు చేసి... శివునికి అభిషేకం నిర్వహించారు.

నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఓంకారేశ్వర, నగరేశ్వర, రథాల గుడి, రాజరాజేశ్వర ఆలయాల్లో ఉదయం నుంచి భక్తులు పోటెత్తారు. పంచామృతాలతో గరళకంఠునికి అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చూడండి: దేశమంతా 'హరహర మహాదేవ శంభోశంకర'

Last Updated : Feb 21, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.