పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారంటూ వచ్చిన ఫిర్యాదులపై ముగ్గురు ఎంపీలకు లోక్‌సభ సచివాలయం నోటీసులు జారీ చేసింది. నరసాపురం ఎంపీ రఘురామతో పాటు తృణమూల్ కాంగ్రెస్ ఫిర్యాదు మేరకు ఆ పార్టీ ఎంపీలు సిసిర్ అధికారి, సునీల్ కుమార్ మండల్‌కు నోటీసులు జారీ అయ్యాయి.
రఘురామపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు వైకాపా ఎంపీల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల స్పీకర్‌ను కలిసిన వైకాపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి.. ఫిర్యాదుకు అదనపు సమాచారం జోడించి ఇచ్చారు. వాటిని పరిగణలోకి తీసుకున్న లోక్‌సభ సచివాలయం 15 రోజుల్లో సమాధానం ఇవ్వాలని రఘురామకు నోటీసులు జారీ చేసింది.