ETV Bharat / city

రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

lock-down
lock-down
author img

By

Published : May 11, 2021, 2:24 PM IST

Updated : May 11, 2021, 3:34 PM IST

14:23 May 11

రేపట్నుంచి 10 రోజులపాటు రాష్ట్రంలో లాక్‌డౌన్‌

కరోనా నియంత్రణా చర్యల్లో భాగంగా రాష్ట్రంలో రేపట్నుంచి లాక్​డౌన్ అమలు కానుంది. పది రోజుల పాటు ప్రతి రోజూ ఉదయం పది గంటల నుంచి లాక్​డౌన్ ఉండనుంది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకొంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్​లో కేబినెట్ సమావేశమైంది. కరోనా నియంత్రణ కోసం తీసుకోవాల్సిన చర్యలపై విస్తృతంగా చర్చించింది.  

రాష్ట్రంలో కొవిడ్ తీవ్రత, పరిస్థితులతో పాటు ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను మంత్రివర్గం సమీక్షించింది. అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని రేపట్నుంచి రాష్ట్రంలో పది రోజుల పాటు లాక్​డౌన్ అమలు చేయాలని నిర్ణయించింది. రేపు ఉదయం పది గంటల నుంచి లాక్​డౌన్ అమలు కానుంది. ప్రతిరోజూ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అన్ని కార్యకలాపాలకు అవకాశం ఇవ్వాలని  కేబినెట్ నిర్ణయించింది. కొవిడ్ టీకా కొనుగోలు కోసం గ్లోబల్ టెండర్లను పిలవాలని మంత్రివర్గం నిర్ణయించింది.

Last Updated : May 11, 2021, 3:34 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.