ఏపీలోని కృష్ణా జిల్లావ్యాప్తంగా.. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ(mptc zptc results 2021) కొనసాగుతోంది. పరిషత్ ఎన్నికలకు.. ఏప్రిల్ 8న పోలింగ్ నిర్వహించారు. జిల్లాలో మొత్తం 41 జడ్పీటీసీ, 648 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు(mptc zptc results 2021) 17 కౌంటింగ్ కేంద్రాల్లో జరుగుతోంది. 41 జడ్పీటీసీ స్థానాలకు.. 159 మంది పోటీపడ్డారు. 648 ఎంపీటీసీ స్థానాలకు.. 1,631 మంది బరిలో నిలిచారు. జిల్లాలో వైకాపా 526 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకోగా తెదేపా 52 స్థానాలను కైవసం చేసుకుంది. జిల్లాలో 41 జడ్పీటీసీలకు ఎన్నికలు జరగగా ఇప్పటివరకు 12 జడ్పీటీసీలను వైకాపా కైవసం చేసుకుంది.
రామిరెడ్డిపల్లి ఎంపీటీసీగా తెదేపా అభ్యర్థి 2 ఓట్లతో గెలుపొందారు. కాని వైకాపా అభ్యర్థి రీకౌంటింగ్ కోరగా.. తెదేపాకు 1 ఓటు మెజార్టీ వచ్చింది. వైకాపా అభ్యర్థి విజ్ఞప్తితో మరోసారి అధికారులు కౌంటింగ్ చేస్తున్నారు.
ఇదీ చదవండి: