పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్ల రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి వర్షం కురిసిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం ద్రోణి తమిళనాడు నుంచి శ్రీలంకకు వెళ్లిపోయిందని వెల్లడించింది.
ఈ రోజు సాయంత్రం ఒకటి రెండు చోట్ల తేలికపాటి వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు. ఎల్లుండి నుంచి చలి తీవ్రత క్రమంగా పెరుగుతుందన్నారు.
ఇదీ చూడండి: సోమవారమే సీఎంగా నితీశ్ ప్రమాణం!