ETV Bharat / city

ఎదిగిన పంట పనికిరాదు.. కొత్త మొక్క మొలకెత్తదు

ఏపీ అంతటా వర్షాలు పడుతూ వాతావరణం సాగుకు అనుకూలంగా మారింది. కానీ ఆ ప్రాంతంలో మాత్రం అన్నీ ఉన్నా లేనట్టే..! సాగుకు నీరుంది. నేలుంది. ఐతే అక్కడ ఇవేవీ అక్కరకు రావట్లేదు..! ఇప్పటికే ఏపుగా పెరిగిన మొక్కల పరిస్థితీ అంతే..! వందలాది మంది జీవితాలను తలకిందులు చేసిన విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్‌లీక్ ప్రభావమిది..! ఎదిగిన పంట పనికిరాక.. నాటిన మొక్క మొలకెత్తక ... నేల స్వభావం అర్థంకాక రైతులు పడుతున్న కష్టాలివి.

ఎల్జీ ఘటన: ఎదిగిన పంట పనికిరాదు.. కొత్త మొక్క మొలకెత్తదు

author img

By

Published : Jul 11, 2020, 8:08 AM IST

ఎల్జీ ఘటన: ఎదిగిన పంట పనికిరాదు.. కొత్త మొక్క మొలకెత్తదు

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖ ఎల్జీ పాలిమర్స్‌ సంస్థలో గ్యాస్‌ లీక్ ప్రమాదం జరిగి రెండు నెలలు దాటిపోయింది. బాధిత గ్రామాల ప్రజల జీవితాల్లో అన్ని రకాలుగా చీకటి నింపేసిన ఆ ఘటన ఇప్పటికీ వారి జీవనశైలిపై ప్రభావం చూపుతూనే ఉంది. ఎంత శుభ్రం చేసినా ఇళ్ల నుంచి వెళ్లని రసాయనం వాసన, జీవనశైలిలో మార్పులు సహా.. కీలకమైన వ్యవసాయ రంగం కూడా ప్రభావితమైది..! ఇతర ప్రాంతాల్లో వర్షం పడుతూ అన్నదాతలు ఏ పంట వేయాలా అని ఆలోచిస్తుంటే.. అన్నీ ఉన్నా ఆశాభంగమే అన్నట్లు తయారైంది ఇక్కడి రైతుల పరిస్థితి.

మొక్కలపైనా స్టైరీన్ ప్రభావం

ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ సమీపంలోని వెంకటాపురం, కంచరపాలెం పరిధిలో రెండు నెలలు కిందట పచ్చటి పొలాలు కనిపించేవి. కానీ ఇప్పుడు రైతుల ముఖాల్లో దుఖం తప్ప మరేమీ కనిపించడం లేదు. ఏటా పంట పుష్కలంగా పండే మేఘాద్రిగడ్డ పరిధిలోనూ దాదాపు ఇదే పరిస్థితి. ఏపుగా పెరిగిన మొక్కలు సైతం స్టైరీన్ ప్రభావంతో నాసిరకంగా తయారయ్యాయి. కొత్తగా వేసిన మొక్కల్లో ఎదుగుదల ఉండడం లేదు. తొలకరిలో కాస్త సాహసం చేసి సరుగుడు, టేకు, అరటి, మామిడి మొక్కలు వేసిన రైతుల పరిస్థితి మరీ దారుణం.

భూసార పరీక్షలు జరగడం లేదు

తెలిసిన ఒకే ఒక్క పని వ్యవసాయం. సాగు చేసేందుకు సాహసం చేయాలన్నా విషవాయవు వ్యాపించిన కొన్ని ప్రాంతాల్లో నేలస్వభావం ఎలా ఉందన్నది రైతులకు అంతుచిక్కడం లేదు. గ్యాస్ ప్రభావిత గ్రామాల్లో ప్రస్తుతం భూసార పరీక్షలు జరగడం లేదని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ప్రాంతాల్లోని భూములు సాగుకు అనుకూలమో! కాదో!..పరీక్షలు చేసి తెలపాలని కోరుతున్నారు.

మరికొందరు రైతులు.. గ్యాస్‌ లీక్‌ ప్రభావంతో తమ భూముల్లో ఎండిన పంటను తొలగించి.. భూమిని చదును చేసి మళ్లీ మొక్కలు వేస్తున్నట్టు చెబుతున్నారు.

ఇదీ చదవండి : కరోనా వ్యాప్తి సమయంలో తరగతులు.. ఆందోళనలో తల్లిదండ్రులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.