కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాల రద్దుకు దిల్లీలో, దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలకు సంఘీభావంగా... ఈ నెల 6న రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేయనున్నట్టు వామపక్షాలు, తెలంగాణ జన సమితి తెలిపింది. హైదరాబాద్ మగ్దూం భవన్లో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అధ్యక్షతన జరిగిన వామపక్ష, తెజస సమావేశంలో నిర్ణయించాయి.
రెండు నెలలుగా ఎన్నో రకాల వ్యయప్రయాసలకోర్చి దిల్లీ నడిబొడ్డున తమ న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్న రైతులను ఏమాత్రం పట్టించుకోకపోగా... వారిలో చీలికలు తెచ్చి ఉద్యమాన్ని బలహీనపరచడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమావేశం అభిప్రాయపడింది. అయినప్పటికీ రైతులు మొక్కవోని ధైర్యంతో, ఉద్యమ స్ఫూర్తితో కొనసాగిస్తున్న పోరాటానికి రాజకీయ పార్టీలే కాకుండా... సమాజమంతా రైతులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.
ఇదీ చూడండి: ఈ నెల 5న కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం