అఖిల భారత రైతుల ఉద్యమానికి మద్దతుగా హైదరాబాద్లో వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. కేంద్రం రైతుల పట్ల నిరంకుశంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. బషీర్బాగ్లో నిర్వహించిన ర్యాలీలో.. వామపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్, వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం బేషరతుగా ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై దిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నా.. రాష్ట్ర సర్కార్ పట్టించుకోకపోవడంపై వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.