ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం ప్రవేశాల కోసం ఏపీలో లాసెట్ కౌన్సెలింగ్ ఈనెల 16 నుంచి ప్రారంభం కానున్నట్లు అధికారులు తెలిపారు. రిజిస్ట్రేషన్, ధ్రువపత్రాల పరిశీలన, ఐచ్ఛికాల నమోదుకు 18 వరకు అవకాశం కల్పించారు.
ఈ నెల 20న సీట్ల కేటాయింపు చేయనున్నారు. సీట్లు పొందిన అభ్యర్థులు ఈ నెల 22, 23 తేదీల్లో కళాశాలలకు హాజరుకావాలని అధికారులు పేర్కొన్నారు.