ETV Bharat / city

Corona: పాఠశాలల్లో కరోనా కలకలం.. వైరస్ బారినపడుతున్న విద్యార్థులు

ఆంధ్రప్రదేశ్​లో పాఠశాలలు పునఃప్రారంభమయ్యాక విద్యార్థులు, ఉపాధ్యాయులు కొవిడ్ బారిన పడుతుండటం ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కృష్ణా జిల్లా శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. అక్టోబర్​లో థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని.. చిన్నపిల్లలపై దీని ప్రభావం అధికంగా ఉంటుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్న తరుణంలో పాఠశాలల్లో కరోనా కేసుల విజృంభణ తల్లిదండ్రులు, విద్యాశాఖ అధికారులను కలవరపెడుతోంది.

Corona: పాఠశాలల్లో కరోనా కలకలం.. వైరస్ బారినపడుతున్న విద్యార్థులు
Corona: పాఠశాలల్లో కరోనా కలకలం.. వైరస్ బారినపడుతున్న విద్యార్థులు
author img

By

Published : Aug 27, 2021, 6:49 PM IST

ఏపీలోని ప్రభుత్వ పాఠశాలలపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. మూడో దశ ముప్పు పొంచి ఉందని అంతా భయపడుతున్న వేళ.. చిన్నారులపై వైరస్ ప్రభావం పెరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా తిరిగి పాఠశాలలు నడుస్తున్న తరుణంలో.. వైరస్ వ్యాప్తి మళ్లీ పెరుగుతున్నట్టే కనిపిస్తోంది.

తాజాగా కృష్ణా జిల్లా నందివాడ మండలం శంకరంపాడు మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఇద్దరు విద్యార్ధులకు కొవిడ్ పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. పాఠశాలలో 30 మంది విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో.. రెండో తరగతి విద్యార్థి, ఐదో తరగతి విద్యార్థికి కొవిడ్​ పాజిటివ్ వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో నేడు, రేపు పాఠశాలకు విద్యాశాఖ అధికారులు సెలవు ప్రకటించారు. పాఠశాలలో అధికారులు శానిటైజ్ చేయించారు.

పమిడిముక్కల మండలం ఆగినపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినికి కరోనా పాజిటివ్ రావడం కలకలం రేపింది. సమాచారం అందుకున్న అధికారులు, ఉపాధ్యాయులు పాఠశాలను పూర్తిగా శానిటైజ్ చేయించారు. విద్యార్థులందరికీ కొవిడ్ పరీక్షలు చేస్తున్నట్టు ప్రధానోపాధ్యాయురాలు స్వరాజ్యలక్ష్మి తెలిపారు.

కొత్తగా 1,515 కేసులు..

మరోవైపు గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 68,865 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1,515 కొత్త కేసులు, 10 మరణాలు నమోదైనట్లు వైద్యారోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా నుంచి 903 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 15,050 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా కారణంగా చిత్తూరు, కృష్ణా జిల్లాల్లో ముగ్గురు చొప్పున, తూర్పుగోదావరి , కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మృతి చెందారు.

ఏపీ కరోనా బులిటెన్
ఏపీ కరోనా బులిటెన్

ఇదీ చదవండి: కరోనా కట్టడి కోసం ఆ రాష్ట్రంలో మళ్లీ లాక్​డౌన్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.