ఆంధ్రప్రదేశ్లో తాజాగా 3,342 మందికి కొవిడ్ సోకినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. కొత్తగా నమోదైన కేసులతో కలిపి బాధితుల సంఖ్య 8,04,026కు చేరింది. ఆ రాష్ట్రంలో కరోనాతో మరో 22 మంది మృతి చెందారు. కాగా ఇప్పటివరకు వైరస్ కారణంగా 6,566 మంది ప్రాణాలు విడిచారు. ఇప్పటివరకు 7,65,991 మంది బాధితులు కోలుకోగా...ప్రస్తుతం 31,469 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల వ్యవధిలో 74,919 మందికి పరీక్షలు నిర్వహించగా...ఇప్పటివరకు మెుత్తం 75.02 లక్షల కరోనా పరీక్షలు నిర్వహించారు.
జిల్లాల వారీగా కేసులు...
పశ్చిమగోదావరి జిల్లాలో 551 కొత్త కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి 445, చిత్తూరు 404, గుంటూరులో 378 , కృష్ణా 344, ప్రకాశం 266, విశాఖ 244, కడప 203, అనంతపురం 131, శ్రీకాకుళం 112, విజయనగరం 106, నెల్లూరు 98, కర్నూలు 60 కేసుల చొప్పున నమోదయ్యాయి.
జిల్లాల వారీగా మరణాలు...
చిత్తూరు 4, కృష్ణా 4, గుంటూరు 4, అనంతపురం 2, విశాఖ 2, తూర్పుగోదావరి 2, కడప 1, ప్రకాశం 1, విజయనగరం 1, పశ్చిమగోదావరి 1 చొప్పున మృతి చెందారు.
ఇవీ చూడండి: చనిపోయిన వారిలో 18 గంటల పాటు వైరస్ సజీవం!