AP Corona Cases: ఏపీలో కరోనా కేసులు భారీగా పెరిగాయి. ఇవాళ ఒక్కరోజే 4,955 మందికి వైరస్ సోకగా.. ఒకరు మృతి చెందారు. కరోనా నుంచి 397 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 35,673 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించారు.
విశాఖ జిల్లాలో 1,103, చిత్తూరు 1,039, నెల్లూరు 397, కడప 377, గుంటూరు 326, కర్నూలు 323 చొప్పున కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ వల్ల పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరు మరణించారు.
దేశంలో కరోనా ఉపద్రవం..
భారత్‌లో రోజువారీ కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఒక్కరోజే.. 2,68,833 కేసులు నమోదయ్యాయి. వైరస్‌తో మరో 402 మంది మరణించారు. 1,22,684 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో దేశంలో రోజువారీ పాజిటివిటీ రేటు 16.66 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
- మొత్తం మరణాలు: 48,57,52
- యాక్టివ్ కేసులు: 14,17,820
- మొత్తం కోలుకున్నవారు: 34,94,7,390
దేశంలో ఒమిక్రాన్ కేసులు..
దేశంలో ఒమిక్రాన్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. 28 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 6,041కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఇదీచూడండి: పోలీసు శాఖలో వైరస్ వ్యాప్తి.. హోంగార్డుల నుంచి ఐపీఎస్‌ల వరకు..