Landscape Park developed Usmansagar: హైదరాబాద్ అంటేనే తీరిక లేని జీవితం. కాంక్రీట్ జెంగల్ లాంటి హైదరాబాద్ వాసులకు తీరిక వేళల్లో సేదతీరేందుకు... అందమైన, ఆహ్లదకరమైన పార్కులను హెచ్ఎమ్డీఏ అభివృద్ధి చేస్తోంది. జంట నగరాల చుట్టూ పలు ఉద్యనవనాలను పర్యాటక ప్రదేశాలు..... ఆడిటోరియాలు ఏర్పాటు చేస్తోంది. కేవలం విశ్రాంతి కోసమే కాకుండా......పలు సమావేశాలు.....చిన్న పార్టీలు చేసుకునేందుకు వీలుగా అభివృద్ధి చేస్తోంది. అందులో భాగంగానే ఉస్మాన్ సాగర్ గండిపేట వద్ద సుందరమైన ఉద్యానవనాన్ని హెచ్ఎమ్డీఏ ఏర్పాటు చేసింది. ఉస్మాన్ సాగర్ చెరువును ఆనుకుని..... ఈ ఉద్యానవనం ఏర్పాటు చేశారు.
హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఈ ల్యాండ్ స్కేప్ పార్కును 5.5 ఎకరాల్లో.... 35 కోట్ల రూపాయల వ్యయంతో తీర్చిదిద్దారు. ఓ వైపు సుందర జలాశయం.. మరోవైపు ఆహ్లాదకర వాతావరణం మధ్య ఈ పార్కును ఏర్పాటు చేశారు. నగర ప్రజలను త్వరలో ఈ పార్కు కనువిందు చేయనుంది. ప్రస్తుతం గండిపేట సందర్శకులకు మౌలిక వసతులు లేవు. ల్యాండ్ స్కేప్ పార్కుతో ఆ కొరత తీరనుంది. అత్యంత సుందరమైన ప్రవేశ ద్వారం ఆహ్వానం పలకనుంది.
ఎంట్రెన్స్ ప్లాజాతో పాటు వాక్ వేలు, ఆర్ట్ పెవిలియన్, ఫ్లవర్ టెర్రాస్, పిక్నిక్ స్పాట్లు,ఓపెన్ థియేటర్, ఫుడ్ కోర్టు లాంటి ఎన్నో సదుపాయలు ఏర్పాటు చేశారు. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, పుప్పాలగూడ, నానక్రాంగూడ, మణికొండ, అత్తాపూర్, రాజేంద్రనగర్ నుంచి తక్కువ సమయంలో ఇక్కడికి చేరుకునే వీలుంటుంది. మరికొద్ది రోజుల్లో ఈ పార్కు ప్రజలకు అందుబాటులోకి రానుంది.
ఇవీ చదవండి: