ETV Bharat / city

మూడు​ బల్బులు, రెండు ఫ్యాన్లు.. బిల్లు లక్షపైనే

కరెంట్​ తీగ పట్టుకుంటే కాదు.. కరెంట్​ బిల్లు చూస్తేనే షాక్​ కొడుతోంది. సాధారణ ఇంటికి వందల్లో, మరీ ఎక్కువ వాడితే వేలల్లో కరెంటు బిల్లు వస్తుంది. కానీ ఏపీ అనంతపురం జిల్లా కణేకల్లలో కూలి పని చేసుకునే మహిళకు ఏకంగా లక్ష దాటి విద్యుత్​ బిల్లు వచ్చింది. బిల్లు మరీ ఇలా వస్తే కచ్చితంగా షాక్​ అవ్వాల్సిందే. విద్యుత్​ అధికారుల నిర్వాకంతో వందల్లో రావాల్సిన​ బిల్లు లక్ష దాటేసింది.

author img

By

Published : Dec 19, 2020, 8:29 PM IST

Shock hitting current bill
లక్ష దాటిన కరెంట్​ బిల్లు

ఏపీలోని అనంతపురం జిల్లా కణేకల్లు స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో కురుబ కామాక్షమ్మ అనే మహిళ నివసిస్తోంది. కూలీనాలీ చేసుకొని జీవనం సాగిస్తున్న ఈమెకు, విద్యుత్‌ అధికారులు కరెంటు బిల్లు రూపంలో షాకిచ్చారు. డిసెంబరులో ఏకంగా రూ.1,49,034 విద్యుత్​ బిల్లు వచ్చింది. ప్రతీ నెలా వంద దాటని బిల్లు లక్ష దాటటంతో కామాక్షమ్మ ఖంగుతింది.

తనకు ప్రతీ నెలా విద్యుత్​ బిల్లు వంద దాటదని.. ఇంట్లో కేవలం మూడు విద్యుత్​ బల్బులు, రెండు ఫ్యాన్లు ఉన్నాయని ఆవేదన చెందింది. తాను జీవితాంతం విద్యుత్​ వినియోగించినా ఇంత బిల్లు రాదని విచారం వ్యక్తం చేస్తోంది. కూలీ పనులు చేసుకుని జీవించే ఆమె.. బిల్లు ఎలా చెల్లించాలో తెలియక విద్యుత్‌ కార్యాలయం చుట్టూ తిరుగుతోంది. ఈ విషయంపై స్థానిక విద్యుత్‌ అధికారులను అడగ్గా.. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలాంటి తప్పు జరిగిందన్నారు. కామాక్షమ్మ ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులతో మాట్లాడి.. ఆమె వినియోగించిన యూనిట్ల మేరకే బిల్లు వచ్చేలా చూస్తామన్నారు.

లక్ష దాటిన కరెంట్​ బిల్లు

ఇదీ చదవండి: మూడు రోజుల పాటు అట్టహాసంగా ఇళ్ల పట్టాల పంపిణీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.