ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి మండల కేంద్రంలో.. ఎమ్మెల్యే పెద్దారెడ్డికి ఓ మహిళ షాక్ ఇచ్చింది. నవరత్నాలులో భాగంగా ఇళ్ల పట్టాల పంపిణీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మండలంలోని 541 మందికి స్థలాలు అందజేసే క్రమంలో.. మీకు ఇంటి పట్టా ఎవరిస్తున్నారు అని ఓ మహిళను ఆయన అడిగారు.
చంద్రన్న ఇస్తున్నాడని సదరు మహిళ జవాబు చెప్పడంతో.. అక్కడున్న అధికారులతా ఒక్క క్షణం ఆశ్చర్యపోయారు. ఇళ్ల పట్టాలు ఇస్తోంది జగనన్న అని ఆమెకు తెలియజేశారు.
ఇదీ చదవండి: తెల్లారిన జీవితాలు... రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐదుగురు కూలీలు