ETV Bharat / city

తెలంగాణలో కరోనా నిర్ధరణ కిట్ల కొరత - lack of covid kits in telangana

రోజుకు దాదాపు 1.50 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించడం వల్ల తెలంగాణలో కరోనా నిర్ధారణ కిట్లకు కొరత ఏర్పడింది. రాష్ట్రానికి సరిపడా సరఫరా చేయలేక ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ చేతులెత్తేసింది. దిల్లీ లాక్​డౌన్ కూడా మరో కారణమని వైద్య వర్గాలు తెలిపాయి.

covid kits, lack of covid kits, lack of covid kits in telangana
కొవిడ్ కిట్లు, కొవిడ్ కిట్ల కొరత, తెలంగాణలో కరోనా కిట్ల కొరత
author img

By

Published : Apr 22, 2021, 7:49 AM IST

రాష్ట్రంలో కరోనా నిర్ధారణ కిట్లకు కొరత ఏర్పడింది. రోజుకు 1.30 లక్షల నుంచి 1.50 లక్షల వరకూ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండటంతో ఆ మేరకు సరఫరా చేయలేక ఒప్పందం కుదుర్చుకున్న కంపెనీ చేతులెత్తేసింది. దిల్లీలో లాక్‌డౌన్‌ విధించడంతో అక్కడ ఉత్పత్తి, సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటం కిట్ల కొరతకు దారితీసిందని వైద్యవర్గాలు తెలిపాయి. బుధవారానికి వైద్యఆరోగ్యశాఖ వద్ద కేవలం లక్ష లోపు ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లు, లక్షన్నర లోపు ఆర్‌టీ పీసీఆర్‌ కిట్లు మాత్రమే అందుబాటులో ఉండటంతో.. గురువారం కొవిడ్‌ పరీక్షలకు ఆటంకం ఏర్పడుతుందా? అనే సందేహాలు వెలువడ్డాయి. దీన్ని చక్కదిద్దేందుకు వైద్యఆరోగ్యశాఖ యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. గురువారం కరోనా నిర్ధారణ పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు వీలుగా.. అత్యవసరంగా లక్షన్నర కిట్లను అందుబాటులో ఉన్న ఇతర సంస్థల నుంచి కొనుగోలు చేసింది. ఇవి బుధవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకుంటాయనీ, గురువారం తెల్లవారేసరికి అన్ని పరీక్ష కేంద్రాల్లో అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశామని వైద్యవర్గాలు తెలిపాయి.

మూణ్నెల్లకు సరిపడా ఒకేసారి..

కిట్ల కొరత నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు అత్యవసరంగా సమావేశమయ్యారు. పరీక్షలు యథావిధిగా కొనసాగించేందుకు అత్యవసర కొనుగోళ్లు జరపడంతోపాటు.. మూణ్నెల్లకు సరిపడేలా ఒకేసారి కిట్లను కొనుగోలు చేయడానికి వీలుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. 90 లక్షల కిట్లను కొనుగోలు చేయడానికి తాజాగా ప్రభుత్వం పరిపాలనపరమైన అనుమతిని ఇచ్చింది. ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లతో పాటు ఆర్‌టీ పీసీఆర్‌ కిట్లను కూడా కొనుగోలు చేస్తారు. ముందుగా 30 లక్షల కిట్లకు తెలంగాణ రాష్ట్ర వైద్యసేవలు మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్‌ పిలిచింది. టెండర్‌లో అతి తక్కువ ధర వేసిన మూడు సంస్థలను ఎంపిక చేయనున్నారు. ఈ మూడింటికి కూడా కిట్ల సరఫరా బాధ్యతలను అప్పగించనున్నారు. నెలనెలా ఎంత మేరకు సరఫరా చేయాలనేది ఒప్పందంలోనే స్పష్టం చేయనున్నారు. అత్యవసర కొనుగోలులోనూ ప్రభుత్వ నిబంధనలను అనుసరిస్తున్నామనీ, సర్కారు ముందస్తు అనుమతుల మేరకే నూతన టెండర్‌కు వెళ్తున్నామని వైద్యవర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నాయి.

ఒక్క సంస్థపైనే ఆధారం

ర్యాపిడ్‌ యాంటీజెన్‌ కిట్లను దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలూ విస్తృతంగా వినియోగిస్తున్నాయి. దీంతో వీటి ఉత్పత్తి కంపెనీల సంఖ్య కూడా పెరిగింది. అదే సమయంలో పోటీ వాతావరణంలో ధర కూడా బాగా తగ్గింది. ఒకప్పుడు ఒక్కో యాంటీజెన్‌ కిట్‌ ధర రూ.400కి పైగా ఉండగా.. ఇప్పుడు రూ.30కే వచ్చేస్తోంది. అయితే టెండర్‌లో తక్కువ ధరకు సరఫరా చేయడానికి ముందుకొచ్చే సంస్థకే ఆ బాధ్యతలను అప్పగించాలి. ప్రస్తుతం దిల్లీ కేంద్రంగా ఉత్పత్తి చేసే సంస్థ కిట్లను అందజేస్తోంది. ఇటీవలివరకూ ఈ ప్రక్రియ సాఫీగా కొనసాగింది. నిర్ధారణ పరీక్షలు భారీగా పెరగడంతో ఆ మేరకు ఉత్పత్తి చేయడంలో సంస్థకు ఇబ్బందులు ఎదురయ్యాయని వైద్యవర్గాలు తెలిపాయి.

ఆ సంస్థ మహారాష్ట్ర, హరియాణా తదితర రాష్ట్రాలకూ సరఫరా చేస్తోంది. అక్కడ కూడా డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో.. తెలంగాణకు ఒకేసారి రెట్టింపు కంటే అధికంగా కిట్లను సరఫరా చేయలేమని ఒప్పంద సంస్థ చేతులెత్తేసింది. దీంతో నిబంధనల ప్రకారం టెండరులో రెండో, మూడో స్థానంలో ఉన్న సంస్థలకు అవకాశం కల్పించాలి. ఈ సంస్థలు కూడా దిల్లీ పరిసరాల్లోనే ఉత్పత్తి చేస్తుండడంతో.. లాక్‌డౌన్‌ ప్రభావం వాటిపైనా పడింది. ముందే రెండు మూడు సంస్థలతో ఒప్పందం చేసుకుని ఉంటే బాగుండేదని నిపుణులు అభిప్రాయపడ్డారు. అయితే అన్ని రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం కొవిడ్‌ పరీక్షల కిట్ల కొరత ఉందనీ, తెలంగాణలో ముందే స్పందించి ఏర్పాట్లు చేసినట్లు వైద్యవర్గాలు తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.