ETV Bharat / city

Unique Holi tradition in AP: జంబలకడిపంబ హోలీ.. మగాళ్లు ఆడాళ్లుగా మారిపోతారు!

author img

By

Published : Mar 18, 2022, 2:54 PM IST

Unique Holi tradition in AP: కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతేకుడ్లురు గ్రామంలో.. హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. హోలీ పండుగ రోజున పురుషులంతా.. ఆడవారి వేషధారణలో కనిపిస్తారు. రెండు రోజులపాటు ఇలాగే ఉంటారు. ఈ వేషధారణలో ఏం చేస్తారో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే...

holy - jambalakadi pamba
holy - jambalakadi pamba
జంబలకడిపంబ హోలీ.. మగాళ్లు ఆడాళ్లుగా మారిపోతారు!

Unique Holi tradition in AP: కర్నూలు జిల్లాల ఆదోని మండలం సంతేకుడ్లుర్ గ్రామంలో హోలీ రోజున వింత ఆచారం కొనసాగుతోంది. ఆంధ్ర-కర్ణాటక సరిహద్దులో ఉండే ఈ గ్రామంలో హోలీ పండుగ వచ్చిందంటే... 'జంబలకడిపంబ' సీన్ రిపీట్ అవుతుంది. మగాళ్లంతా ఆడాళ్లుగా మారిపోతారు. మారిపోవడమంటే నిజంగా కాదు.. స్త్రీ వేషధారణలోకి మారిపోతారు.

చీర కట్టుకొని, నగలు, పూలు అలంకరించుకుని.. అచ్చం మగువలుగా రెడీ అవుతారు. అనంతరం రతీ మన్మథులను పూజిస్తారు. ఈ ఆచారం తరతారాల నుంచీ కొనసాగుతోందని గ్రామస్థులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల కోరికలు తీరుతాయని తమ నమ్మకమని అంటున్నారు.

"ఇక్కడ ప్రతి సంవత్సరం హోలీ పండుగ సమయంలో మగవారు ఆడవేశం వేస్తారు. అలా ఆడ వేశధారణలో దేవుడిని పూజిస్తే కోరిన కోరికలు తీరుతాయి. నేను 5 ఏళ్ల నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నాను." - విద్యార్థి

పురుషులు ఆడవాళ్ల వేషధారణ చేసుకుని పూజించడం వల్ల పంటలు బాగా పండుతాయని.. గ్రామానికి కష్టాలు రాకుండా ఉంటాయని.. ఇంట్లో ఏ సమస్యలు ఉండవని స్థానికులు చెబుతున్నారు. అందుకే ఏటా హోలీ పండుగకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు ఈ ఆచారాన్ని చూడటానికి భారీగా వస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది వచ్చి మహిళల వేశధారణలో పూజలు చేసి.. మొక్కులు చెల్లించుకుంటారని చెబుతున్నారు.

"చిన్నప్పటి నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నాను. ఇది తరతరాల సంప్రదాయం. ఇలా ఆడవారి వేషధారణలో మన్మథ స్వామివారిని పూజిస్తే.. పంటలు బాగా పండుతాయి. గ్రామానికి ఎలాంటి కష్టాలూ రావు. ఇంట్లో సమస్యలు ఉండవు. ఈ పండుగను రెండు రోజుల పాటు జరుపుకొంటాం." - గ్రామస్థుడు

ఇదీ చదవండి: అమ్మవారే ఇంటింటికీ వెళ్తారు.. ఇదే అక్కడి ప్రత్యేకత..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.