ETV Bharat / city

'ప్రతి సమస్యకు పరిష్కారం చూపడమే కేసీఆర్ లక్ష్యం' - ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలు, రైతులకు లబ్ధి చేకూరనుందని.. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని భూ సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒక్క నిర్ణయంతో పరిష్కారం చూపనున్నారని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్​ డివిజన్​లో సీసీరోడ్డు, వాటర్​ పైప్​లైన్​ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

Kukat Pally MLA Krishna Rao inaugurates Development Works in Bala nagar Division
అభివృద్ధి పనులు ప్రారంభించిన ఎమ్మెల్యే కృష్ణారావు
author img

By

Published : Oct 5, 2020, 2:58 PM IST

ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కాని సమస్యలకు ముఖ్యమంత్రి కేసీఆర్​ ఒక్క నిర్ణయంతో పరిష్కార మార్గం చూపిస్తారని కూకట్​పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. హైదరాబాద్​ బాలానగర్​ డివిజన్​లో రూ.34 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్లు, వాటర్​ పైప్​లైన్ పనుల​ను ఆయన ప్రారంభించారు.

కొత్తగా నిర్మిస్తున్న ఫ్లై ఓవర్,​ నరసాపురం చౌరస్తాలో నిర్మిస్తున్న అండర్​ బ్రిడ్జి వల్ల ట్రాఫిక్​ సమస్యలు తీరుతాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కాండూరి నరేంద్రాచారి, ఎమ్మార్వో గోవర్ధన్ తదితరులు పాల్గొన్నారు. బాలానగర్​ డివిజన్​లో ఏర్పాటు చేసిన రెవెన్యూ చట్టం అవగాహన సదస్సులో పాల్గొని.. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించారు. నూతన రెవెన్యూ చట్టం వల్ల పేదలు, రైతులు లబ్ధి పొందుతారని తెలిపారు.

ఇవీ చూడండి: 'కాంగ్రెస్ వస్తే వ్యవసాయ చట్టాలు చెత్తబుట్టలోకి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.