ETV Bharat / city

కేంద్ర నిర్ణయంతో చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతుంది: కేటీఆర్‌ - చేనేత, వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ

KTR Letter To Piyush Goyal
పీయూష్​ గోయల్​కు కేటీఆర్​ లేఖ
author img

By

Published : Dec 19, 2021, 5:00 PM IST

Updated : Dec 19, 2021, 7:27 PM IST

16:59 December 19

కేంద్ర నిర్ణయంతో చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతుంది: కేటీఆర్‌

KTR Letter To Piyush Goyal: వస్త్ర పరిశ్రమపై జీఎస్టీని ఏడు శాతం పెంచుతూ ఇటీవల జీఎస్టీ కౌన్సిల్​ తీసుకున్న నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రి పీయూష్​ గోయల్‌కు లేఖ రాశారు. దేశ చరిత్రలో ఏనాడూ చేనేత ఉత్పత్తులపైన పన్ను లేదని.. కేంద్రం జీఎస్టీ ద్వారా మొదటిసారి 5 శాతం విధించిందని అన్నారు. అప్పుడే చేనేత రంగం నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురైనట్లు లేఖలో మంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు మళ్లీ మరో 7 శాతం విధించడం సబబు కాదని.. ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు.

కరోనాతో తీవ్ర సంక్షోభం

GST on powerloom and textiles industry: ఇప్పటికే కరోనా ప్రభావంతో టెక్స్‌టైల్‌, చేనేత రంగాలు రెండేళ్లుగా తీవ్ర సంక్షోభంతో గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నాయని మంత్రి కేటీఆర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల్లో జీఎస్టీ పెంచడమంటే.. ఆ పరిశ్రమను చావుదెబ్బ తీయడమే అని పేర్కొన్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధిని కల్పించేది చేనేత, వస్త్ర పరిశ్రమలని... ఈ పరిస్థితుల్లో అదనపు ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు కల్పించి ఆదుకోవాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్రం తీసుకున్న నిర్ణయంతో చేనేత రంగం పూర్తిగా కుదేలై పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

మినహాయింపు పెంచాలి

'తెలంగాణ రాష్ట్రం అద్భుతమైన చేనేత చీరలకు ప్రసిద్ధిగాంచింది. వస్త్ర పరిశ్రమపై జీఎస్టీ పెంపుతో వ్యాపారులు.. తీవ్ర ఆందోళన చెందుతున్నారు. 2017మే 18న జీఎస్టీ కౌన్సిల్.. చేనేత ఉత్పత్తులపై ఎలాంటి పన్నులు లేకుండా ఉండాలని తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాలి. జీఎస్టీ పెంపు ప్రతిపాదనను విరమించుకోకుండా ముందుకు వెళ్లాలనుకుంటే చేనేత, పవర్‌లూమ్‌ వ్యాపారులకు ప్రస్తుతం ఉన్న ట్యాక్స్‌ బేస్‌ జీఎస్టీ మినహాయింపును రూ.20 లక్షల నుంచి 50 లక్షలకు పెంచాలి. తద్వారా లక్షలాది మంది చేనేత వ్వాపారులకు ప్రయోజనం కలుగుతుంది.' అని కేటీఆర్​ లేఖలో వివరించారు.

ధరల భారం

ఏడాది కాలంగా పరిశ్రమకు అవసరమైన ముడి సరుకుల ధరలు 30 నుంచి 40 శాతం పెరిగాయని.. కరోనా సంక్షోభంతో చైనా వంటి దేశాల నుంచి వచ్చే దిగుమతులు తగ్గాయని కేటీఆర్​ లేఖలో పేర్కొన్నారు. దీంతో పరిశ్రమకు అవసరమైన రసాయనాల ధరలు సైతం భారీగా పెరిగాయని వివరించారు. రవాణా ఖర్చులు వ్యాపారులపై భారం మోపుతున్నాయని ప్రస్తావించారు. జీఎస్టీ పెంచితే చిన్న తరహా పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని కేటీఆర్​.. లేఖలో వెల్లడించారు.

ఇదీ చదవండి: Metpally government school: వేధిస్తున్న తరగతి గదుల కొరత.. విద్యార్థులకు తప్పని అవస్థలు

Last Updated : Dec 19, 2021, 7:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.